English | Telugu

భీమ్ పాటని మందు పాటగా మార్చేసిన చలాకీ చంటి

హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ క‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ఈటీవిలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో టాప్ టీఆర్పీ రేటింగ్ తో కొన‌సాగుతోంది. ఈ షోకు ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌నో, న‌టి ఇంద్ర‌జ జడ్జిలుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక టీమ్ లీడ‌ర్స్ గా తాగుబోతు ర‌మేష్‌, రాకెట్ రాఘ‌వ‌, చ‌లాకీ చంటి, సునామీ సుధాక‌ర్‌, రైజింగ్ రాజు, శాంతి స్వ‌రూప్‌ ప్ర‌స్తుతం జ‌బ‌ర్త‌స్త్ షోలో స్కిట్ లు చేస్తున్నారు. ఈ గురువారం రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు.

రాకెట్ రాఘ‌వ `వాన జ‌ల్లు గిల్లుతుంటే..` అనే పాట‌తో ప్రోమో మొద‌లైంది. బామ్మ‌గా తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు న‌వ్వులు పూయిస్తున్నాయి. రాకెట్ రాఘ‌వ రెయిన్ సాంగ్ చేసి వ‌స్తే అత‌ని భార్య ప్లేట్ తో ఎంట్రీ ఇస్తుంది. 'ఏంటీ నువ్వు దిష్టి తీయ‌డానికి రాలేదా?' అంటే 'నీ బెండు తీయ‌డానికి వ‌చ్చాను రా?' అంటూ రాఘ‌వ‌ని చెడుగుడు ఆడుకోవ‌డం... త‌న ఫ్రెండ్ పెళ్లి కోసం బామ్మ‌గా మారిన తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు.. వేసిన వేషాలు న‌వ్వులు పూయించేలా వున్నాయి.

ఇక వీళ్ల త‌రువాత స్టేజ్ పై కొచ్చిన చ‌లాకీ చంటీ తాగుబోతుల స్కిట్ తో న‌వ్వులు పూయించాడు. 'మందేస్తూ చిందెయ్ రా'.. అనే సాంగ్ తో త‌న టీమ్ తో ఎంట్రీ ఇచ్చిన చ‌లాకీ చంటీ 'అంద‌రికీ ఓ దిన‌ముంది.. మాక్కూడా ఓ దినం కావాలే' అంటాడు. దీంతో చంటి ప‌క్క‌నే వున్న వ్య‌క్తి 'తాగుబోతుల దినోత్స‌వ‌మా?' అన‌గానే అత‌ని చెంప ప‌గ‌ల‌గొట్టిన చలాకీ చంటి.. 'తాగుబోతు అంటావుర‌ న‌న్ను.. ఎంపీపీ మ‌ధ్య పాన ప్రియుడు అనాల‌'న్నాడు.

ఆ త‌రువాత `ఆర్ ఆర్ ఆర్‌` సినిమాలోని `కొమురం భీముడో..` పాట‌ని మందు పాట‌గా మార్చేశాడు. `విస్కీదేవాలా బ్రాండీ దేవాలా... గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట ప‌క్క‌నా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్క‌కీ ముక్క ముక్క‌తో జుర్రుకోవాలా... దొబ్బితాగాలా..` అంటూ కొమురం భీముడో పాట‌ని చ‌లాకీ చంటి తాగుబోతుల పాట‌గా మార్చేశాడు. దీంతో ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ వైర‌ల్ గా మారింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.