English | Telugu

అను - ఆర్యల‌ శోభ‌నానికి రాగ సుధ బ్రేక్ వేస్తుందా?


బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. మరాఠీ సీరియ‌ల్ `తుల ఫ‌ఠేరే` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇప్ప‌టికే ఏడు భాష‌ల్లో ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. `బొమ్మ‌రిల్లు` వెంక‌ట్ శ్రీ‌రామ్‌, వ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, విశ్వ‌మోహ‌న్ , జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, రామ్ జ‌గ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతోంది. థ్రిల్ల‌ర్ క‌థాంశం కావ‌డంతో మ‌హిళా ప్రేక్ష‌కుల‌తో పాటు అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంటోంది.

ఈ శుక్ర‌వారం ఎపిసోడ్ ఎలా వుంటుందో ఒక‌సారి చూద్దాం. అను - ఆర్యల‌ శోభ‌నం కోసం ప‌ద్దు - సుబ్బుల ఇంట్లో ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు రోస‌మే ఎదురుచూస్తున్న ఆర్య చాలా ఎక్సైట్ మెంట్ తో వుంటాడు. అయితే అనూహ్యంగా ఆర్య కు బ‌స్తీ వాసులు షాకిస్తారు. అందంగా అలంక‌రించిన శోభ‌నం గ‌దిలో బ‌స్తీవాసులంతా చేరి నిద్రిస్తున్న‌ట్టుగా న‌టిస్తూ వుంటారు. వారిని చూసి షాక్ కు గురైన ఆర్య వ‌ర్థ‌న్ ఏంటిది? వీళ్లంద‌రిని ఇక్క‌డి నుంచి పంపించు అంటాడు. నాకు శోభ‌నానికి ఎలాంటి తొంద‌ర‌లేద‌ని అను కూడా ఆర్య‌ని ఏడిపించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

క‌ట్ చేస్తే .. జెండే, ప‌ద్దు, సుబ్బుల‌తో పాటు జ‌య‌ల‌లిత టర్రాస్ పై కూర్చుని క‌బుర్లు చెప్పుకుంటుంటారు. అక్క‌డికి రాగ‌సుధ‌ని తీసుకొస్తాడు సంప‌త్ . వీళ్లు అక్క‌డ వున్నార‌ని తెలియ‌క రాగ‌సుధ వ‌చ్చేసి బుక్క‌యిపోయాన‌ని కంగారు ప‌డుతూ వుంటుంది. ఇంత‌లో జెండే రాగ‌సుధ ప‌రాయి మ‌గాళ్ల ముందు ముసుగు తీయ‌ద‌ని, అది వాళ్ల సంప్ర‌దాయ‌మ‌ని చెబుతాడు. ఇదేంటీ? కొత్త‌గా మా ద‌గ్గ‌ర ఫ్రీగానే వుంటున్నావుగా.. అని ప‌ద్దు అనుమానంగా అలంటుంది. ఎక్క‌డ దొరికి పోతానేమోన‌ని రాగ‌సుధ కంగారుప‌డుతూనే క‌వ‌ర్ చేస్తుంది. ఇంత‌లో జెండే అది వాళ్ల సంప్ర‌దాయం వ‌దిలేయండి అంటాడు. దీంతో రాగ‌సుధ ఊపిరి పీల్చుకుంటుంది.

క‌ట్ చేస్తే...శోభ‌నం గ‌దిలో బ‌స్తీ జ‌నం గాఢ నిద్ర‌ని న‌టిస్తున్నార‌ని, ఆర్య ని ఇబ్బంది పెడుతున్నార‌ని తెలుసుకున్న ప‌ద్దు వెంట‌నే సుబ్బుని తీసుకుని శోభ‌నం గ‌దికి వ‌చ్చేస్తుంది. అక్క‌డ బ‌స్తీ వాసుల ని చూసి షాక‌వుతుంది. న‌టించింది చాలు కానీ లేవండి అంటూ ఆరుస్తుంది. అయినా ఎవ‌రూ లేవ‌రు. దీంతో త‌న వ‌ద్ద ఓ చిట్కా వుంద‌ని, అది పాటిస్తే ఇక్క‌డున్న అంద‌రూ లేచి ప‌రుగెడ‌తార‌ని చెబుతుంది అను. అయితే ఆల‌స్య‌మెందుకు కానియ్ అంటాడు. కానీ నాకేంటీ? అని ఎదురుప్ర‌శ్రిస్తుంది. ఆర్య రిక్వెస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా బ‌స్తీవాసుల్ని అక్క‌డి నుంచి ప‌రుగెత్తేలా చేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. రాగ సుధ ప్లాన్ ప్ర‌కారం అను - ఆర్య‌ల శోభ‌నం ఆగిపోయిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.