English | Telugu

నయని పావని ఎమోషనల్.. ఇమిటేట్ చేసిన టేస్టీ తేజ!


నయని పావని.. గత సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అప్పుడు అందరు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అన్నారు. ఆమె ఎలిమినేషన్ అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు నయని పావనికి సెకండ్ ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

నయని పావని గత వారం నామినేషన్ లోకి వస్తే మళ్ళీ లాస్ట్ సీజన్ లో జరిగినట్లు అవుతుందేమోనని రాయల్ క్లాన్స్ వాళ్ళు స్పెషల్ పవర్ ని వాడుకొని నయనిని నామినేషన్ లో లేకుండా చేశారు. అయితే లాస్ట్ సీజన్ లో నాకు ఛాన్స్ ఇచ్చి గేమ్ బాగా ఆడకుంటే.. అప్పుడు ఎలిమినేట్ అయిన పర్వాలేదు కానీ ఛాన్స్ ఇవ్వలేదని బాధపడింది నయని. కానీ ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా కూడ ప్రూవ్ చేసుకోవడం లేదు. గత వారంలో నయని ఎమోషనల్ అయితే అలా అవొద్దని నాగార్జున చెప్పాడు. ప్రస్తుతం హౌస్ లో టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ప్రతి ఒక్కరు ఏదోవిధంగా ఛార్జింగ్ సంపాదించుకుంటున్నారు. కానీ నయని పావని తప్ప.

నాకు ఎవరు ఛార్జింగ్ ఇవ్వట్లేదు.. టాస్క్ మొదట నుండి ఎవరికి నాకు ఇవ్వాలనిపించడం లేదా.. మణికంఠ ఎప్పుడు నన్ను ఫ్రెండ్ అంటాడు.‌. అసలు ఇవ్వలేదని నయని అనగానే.. నువ్వు నయనికి ఇస్తా అన్నావ్ కదా అని మణికంఠని హరితేజ అంటుంది. మెహబూబ్ దొంగతనం గా తీసుకున్నాడు. నాకే లేదని మణికంఠ అంటాడు. ఇక నేను ఎవరిని అడగను.. ఇచ్చిన తీసుకోనని నయని రెండు, మూడు సార్లు రిపీట్ చేస్తుంది. దాంతో అది విన్న తేజ కోపంగా.. ఎన్నిసార్లు అంటావంటూ తనని ఇమిటేట్ చేస్తాడు. నువు అలా ఇమిటేట్ చెయ్యకు తేజ అంటూ నయని లోపలికి వెళ్లి హరితేజకి చెప్తూ బాధపడుతుంది. కానీ నయని పర్ఫామెన్స్ హౌస్ లో అంతగా లేదు కానీ బయట శివాజి సపోర్ట్ తో నెట్టుకొస్తుంది. మరి ఈ వీకెండ్ లో నాగార్జున తనకి వార్నింగ్ ఇస్తాడా లేదా చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.