English | Telugu

Biggboss 8 Telugu Promo: యష్మీ గౌడ ని గన్ తో కాల్చేసిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారమంతా హౌస్ లో ఎవరేం చేశారు? ఎవరేం తప్పు చేశారంటూ వాళ్లకి నాగార్జున క్లాస్ పీకే శనివారం రానే వచ్చింది. ఇక వీకెండ్ నాగార్జున కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకే ప్రోమో కోసం ఆందరు ఎదురుచూస్తుంటారు.

ఆ ప్రోమో రానే వచ్చింది. గత వారం నాగార్జున తన పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల ఎవరిని ఎక్కువగా అనకుండా చాలా సింపుల్ గా ఉన్నాడు. మునుపటి ఫైర్ లేదు. మరి హౌస్ లో కన్నడ బ్యాచ్ చేసే కన్నింగ్ చేష్టలకి ముగింపు ఇచ్చి వార్నింగ్ ఇస్తాడో లేదో అని ఇంటెన్స్ తో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ ప్రోమోలో ఏం ఉందంటే.... వచ్చీ రాగానే నాగార్జున గన్ పట్టుకొని వచ్చేశాడు.‌ ఇక హౌస్ లోని ముగ్గురు చీఫ్ లని నిల్చోమని చెప్పాడు. ఎవరి క్లాన్ బాగా ఆడిందో చీఫ్ లనే చెప్పమని నాగార్జున అడుగగా.. ప్రేరణని రెడ్ లో ఉంచింది యష్మీ. ఎందుకంటే తను సంఛాలక్ గా ఫెయిల్ అయ్యిందంటూ యష్మీ చెప్పగా.. మరి నువ్వు సంఛాలక్ గా సీత, మణికంఠలు ఆడిన టాస్క్ లో ఫెయిల్ అవ్వలేదా అని నాగార్జున అడిగాడు. మణికంఠ అడిగానని చెప్తున్నాడు నువ్వు అడగలేదని అంటున్నావ్.. ఎవరు నిజం చెప్తున్నారో చూద్దామని సీసీటీవి ఫుటేజ్ చూపించగా.. అందులో నియర్ బై( దగ్గరగా) ఉందని తీసుకుందామని కిర్రాక్ సీత అనగా.. ఒకే అని యష్మీ ఒప్పుకుంది. ఆ తర్వాత మణికంఠ గెలవకుండా ఉండాలని , ఆ టీమ్ గెలవకూడదని అలా చేసానంటు యష్మీ చెప్పుకొచ్చింది. సంఛాలక్ గా యష్మీ ఫెయిల్ అంటు గన్ తో బోర్డ్ మీద ఉన్న యష్మీ ఫోటోని కాల్చేశాడు.

ఇక అభయ్, విష్ణుప్రియల మధ్య జరిగిన దాని గురించి కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టున్నాడు నాగార్జున. ఇక పృథ్వీ, నిఖిల్ ని స్ట్రాంగ్ ప్లేయర్స్ అని యష్మీ గ్రీన్ లో పెట్టమని అంది‌‌‌ కానీ నాగార్జున.. ఇది నీ దృష్టిలో అసలేం జరిగిందో చూద్దామని అన్నాడు. మరి యష్మీ, ప్రేరణలకి ఈసారి గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూసారా మీరు. చూస్తే కామెంట్ చేయండి.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.