English | Telugu

Shekar Basha Elimination: శేఖర్ బాషా ఎలిమినేషన్.. షాక్ లో బిగ్ బాస్ ఫ్యాన్స్!

బిగ్ బాస్ హౌస్ లో సెకెండ్ వీక్ ఎండ్ కి వచ్చేసింది. ఇక రెండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

ఇక వీకెండ్ లో శేఖర్ బాషా ఎలిమినేషన్ (Shekar basha elimination) జరిగిందనే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ పోల్స్ లో కిర్రాక్ సీత, పృథ్వీ లీస్ట్ లో ఉండగా.. అనూహ్యంగా శేఖర్ బాషా ఎలిమినేషన్ అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చే కొన్ని లీక్స్ వల్ల ఈ న్యూస్ బయటకొచ్చిందని టాక్ నడుస్తుంది. అసలు ఇది నిజమేనా.. అంటే జరిగే ఛాన్స్ లు వందకి వంద శాతం ఉన్నాయి. ఎందుకంటే ఈ వారమంతా శేఖర్ బాషా పేరు ఒక్క టాస్క్ లో కూడా వినపడలేదు. అసలు అతనికి సంబంధించిన ఫుటేజ్ లేనే లేదు. ఇక కిర్రాక్ సీత గేమ్స్ లో బాగా ఆడింది. అందరితో బాగా ఉంది. కాస్త స్క్రీన్ స్పేస్ కూడా ఉంది.‌ కానీ శేఖర్ బాషాకి సంబంధించిన ఏ కంటెంట్ లేదు. ఇక ఇతడిని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ లు భారీగానే ఉన్నాయి.

శనివారం ప్రోమోలో యష్మీ, ప్రేరణకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున ‌. ఇక నాగ మణికంఠ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా మెరుగైన ఆట కనబరిచాడు. ఇక శేఖర్ బాషా ఎలిమినేషన్ అనగానే అటు మీడియా, ఇటు ఏఫ్ఎమ్ అంతా ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇది నిజంగా బిగ్ బాస్ ఇచ్చిన షాక్ అనే చెప్పాలి. మొన్నటి ఎమోషనల్ సర్ ప్రైజ్ ఎపిసోడ్ లో కూడా అతనికి స్క్రీన్‌ స్పేస్ తక్కువే ఇచ్చారు బిబి టీమ్. అంటే అతడి ఎలిమినేషన్ ముందే ఫిక్స్ అయిందని తెలుస్తుంది. Shocking elimination in Bigg boss 8 అంటూ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.