English | Telugu

Podharillu : భూషణ్ తో మహా పెళ్ళి జరగాల్సిందేనని పట్టుబట్టిన ప్రతాప్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -27 లో... చక్రి, మహాల వెంట రౌడీలు పడుతుంటారు. దాంతో వాళ్లు స్టేషన్ లోపలకి వస్తారు. స్టేషన్ లోపలికి రౌడీలు వచ్చి.. వాళ్లపై ఎటాక్ చేస్తారు. అప్పుడే ఏంటి మీ గొడవ అని పోలీసులు రౌడీలపై కోప్పడతారు. అప్పుడే ఆది, ప్రతాప్, భూషణ్ కూడా స్టేషన్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు చక్రిపై గొడవకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుపడతారు.

మహా మాతో వచ్చేయ్ అని ప్రతాప్ అనగానే.. చక్రి చెయ్ పట్టుకొని నేను రానని మహా అంటుంది. నువ్వు రా పెళ్లి టైమ్ కి వెళ్ళాలని భూషణ్ అంటుంటే.. నీతో పెళ్లి ఇష్టం లేదనే వచ్చాను.. మళ్ళీ ఎందుకు వస్తానని మహా అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. తనకి పెళ్లి ఇష్టం లేక వచ్చేసిందని చక్రి అంటాడు. ఇన్‌స్పెక్టర్ చక్రిని పక్కకి తీసుకొని వెళ్లి.. అసలు ఏమైందని అడుగుతాడు. ఏం లేదు సర్ అక్కడున్న వాడితో పెళ్లి ఇష్టం లేక ఆ అమ్మాయి వచ్చేసింది. మరి నువ్వు అంటే ఇష్టమా అని అడుగుతాడు. ఆమె నాకు ఇష్టం.. తనకి నేను ఇష్టమో లేదో తెలియదు.. తన ఇష్టమే నా ఇష్టమని చక్రి అంటాడు. దాంతో ఇన్‌స్పెక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు. అ తర్వాత మహాని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. నేను రానని మహా మొహంపైనే చెప్పేస్తుంది.

అ తర్వాత నేను నా కూతురితో ఒక అయిదు నిమిషాలు మాట్లాడుతానని ఇన్స్పెక్టర్ ని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. లేదు సర్ మీరు బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్తే మా ఉద్యోగం పోతుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. లేదు మాట్లాడుతానని ప్రతాప్ అనగానే సరే అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. నిన్ను ప్రాణంగా పెంచాను కదా అని మహాతో ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. నాన్న మీరు వాడితో పెళ్లి వద్దంటే ఇప్పుడే మీతో వస్తానని మహా అనగానే భూషణ్ తో నీ పెళ్లి జరగాల్సిందేనని ప్రతాప్ అంటాడు. తరువాయి భాగంలో మీ నాన్న ఎలా అయిన పెళ్లి చేస్తాడు. అదేదో అతన్ని చేసుకొని హ్యాపీగా ఉండమని చక్రిని ఉద్దేశ్యించి ఇన్ స్పెక్టర్ చెప్తాడు. దాంతో మహా షాక్ అవుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.