English | Telugu
బాలుతో కావ్య రొమాన్స్...జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం
Updated : Sep 14, 2024
ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్స్ ప్రోమో మస్త్ ఉంది. అందులోనూ ఇందులో కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి. బుల్లితెర నటుడు ఆకర్ష్ బైరముడి ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు. ఆకర్ష్ కి రీసెంట్ గా పెళ్ళైన విషయం తెలిసిందే. ఆయన భార్య పేరు ఐశ్వర్య. ఐతే ఈ ఎపిసోడ్ కి ఆకర్ష్ ఒక రెడ్ జాకెట్ వేసుకొచ్చాడు. దాని మీద ఆర్ అనే లెటర్ ఉండేసరికి శ్రీముఖికి దొరికిపోయాడు. "మీ ఆవిడ పేరు ఐశ్వర్య కదా మరి నీ జాకెట్ మీదకు రోహిణి ఎందుకొచ్చింది" అని అడిగేసింది. "అంటే ఐశ్వర్య నా లైఫ్ లో ఉంది.
రోహిణి నా జాకెట్ మీదైనా ఉంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. దానికి శ్రీముఖి "అమ్మో రోహిణి ఒకరు గదిలో, ఒకరు మదిలో" అంటా అని హడావిడి చేసింది. తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలకు పోటీలు పెట్టింది. ఐతే పవిత్ర, కావ్య మీ ఇద్దరూ ఒక అబ్బాయిని డిసైడ్ చేసుకోండి. అని శ్రీముఖి అడిగేసరికి 'బాలు" అని అన్నారిద్దరూ.. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే నిఖిల్-కావ్య జోడీ అన్న విషయం తెలిసిందే ఐతే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇప్పుడు కావ్య సింగల్ గా ఉండిపోయింది. ఇక ఇప్పుడు బాలు-కావ్య వచ్చే గేమ్ ఆడారు. ఈ జోడిని ఇలా స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం అంటూ శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఆ గేమ్ లో కావ్య ఓడిపోయింది. ఇక శ్రీముఖి "ఏంటి కావ్య బాయ్స్ కి పాయింట్ ఇద్దామనుకుంటున్నావా" అని అడిగింది. దానికి కావ్య "పది సెకన్లు బాలుతో గేమ్ ఆడేసరికి మైండ్ డిస్ట్రాక్ట్ ఐపోయింది" అని చెప్పింది. దానికి బాలు "అవునా" అని అడగడం భలే క్యూట్ గా అనిపించింది.