English | Telugu

దేవీ నవరాత్రులలో లాస్య మంజునాథ్ కొత్త ట్రెండ్!

బతుకమ్మ, దసరాలకి తెలంగాణాలో ఎంతో విశిష్టమైన ఆదరణ ఉంది. ఇక ఈ పండగ సమయంలో భక్తులు దేవీ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.‌ అందులో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. లాస్య కాస్త ఢిపరెంట్ గా దేవీ నవరాత్రులని జరుపుకుంటుంది.

బుల్లితెర మీద లాస్య మంజునాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు లాస్య-రవి చేసిన అల్లరి గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బుల్లితెరకి విరామం ఇచ్చింది. లాస్య మంజునాథ్ కి ఇద్దరు మగపిల్లలు. పిల్లలు పుట్టాక పెద్దగా షోలలో కనిపించలేదు. ఈ సంవత్సరం బోనాల జాతరలో జీ తెలుగుకి వచ్చి హంగామా చేసింది.

ఇక లాస్య దేవీ నవరాత్రులు విశిష్టతని తెలుపుతూ రోజుకో గెటప్ తో కన్పిస్తుంది. మొదటి రోజు శైలపుత్రీ దేవీ. ఎల్లో కలర్ ఏదో పాజిటివిటి ఉంది. ఒక హ్యాపీ ఫీలింగ్ అని పసుపు రంగు చీరలో పోస్ట్ ని షేర్ చేసింది. ఇక రెండో రోజు- బ్రహ్మచారిణి దేవి. ఎంతో జీవంతో నిండి , ఆనందాన్ని వెదజల్లుతున్నట్టు ఉంది. గ్రీన్ కలర్ చీరలో పోస్ట్ ని షేర్ చేసింది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు , మన సమస్యలతో పోరాటం చేసి, కొత్త అవకాశాలు, ఒక ఫ్రెష్ స్టార్ట్ గురించి తెలియజేస్తుందని రాసుకొచ్చింది లాస్య.

ఇక మూడో రోజు చంద్రగంటా దేవీ.. గ్రే కలర్. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంథ్.. రెండింటి కాంబినేషనే ఈ కలర్. మెంటల్లీ బాగా ప్లాన్ చేసుకుంటూ ఫిజికల్లీ వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ దుర్గా దేవీ రాక్షసులని ఎదుర్కొన్నట్టు ప్రాబ్లమ్ ఏదైనా పారిపోయేలా ముందుకెళ్ళడమే అని లాస్య రాసుకొచ్చింది. ఇక మట్టిలో పనిచేస్తూ కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఇలా దేవీ నవరాత్రులలో లాస్య చేస్తున్న ఈ తరహా వివరణ బాగుంది. లాస్య చేస్తున్న కొత్త ట్రెండ్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఆదరణ లభిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.