English | Telugu

Karthika Deepam 2: దీప వారసురాలని ఎవరితో చెప్పకు.. దాసుతో కార్తీక్ ఒప్పందం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-354లో.. దీపే అసలైన వారసురాలని చెప్పేస్తానని, నేను బతికి ఉంటే ప్రమాదమని జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని కార్తీక్‍తో దాసు అంటాడు. తనను తలపై కొట్టిందని చెప్తాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేను తన కన్నతండ్రినని తెలిసి చంపాలనుకుందంటే అసలైన వారసురాలిని వదిలిపెడుతుందా అని కార్తీక్ తో దాసు చెప్తాడు. దీంతో కార్తీక్ కంగారుపడతాడు. దీపే అసలైన వారసురాలు అని జ్యోత్స్న నిశ్చితార్థం రోజు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పనివ్వలేదని దాసు అంటాడు. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదని చెప్తాడు.

నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా.. దీప పెద్ద మామయ్య కూతురు ఏంటి.. జ్యోత్స్న నీ కూతురు ఏంటని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలుసు కదా అని అడుగుతాడు. లేదు.. దీపే అసలైన వారసురాలు అనే విషయం నాకు, జ్యోత్స్నకు మాత్రమే తెలుసంటాడు దాసు. దీపే అసలైన వారసురాలని తెలిస్తే మా అమ్మకు, జ్యోత్స్నకు నష్టమే, కాబట్టి వాళ్లు దీపను చంపే ప్రయత్నం చేయవచ్చు అల్లుడు అని కార్తీక్‍తో దాసు అంటాడు. లేకపోతే మా అమ్మకు తెలియకుండా జ్యోత్స్న ఒక్కటే ఈ పని చేసి ఉండొచ్చని అంచనా వేస్తాడు. ఎందుకంటే జ్యోత్స్నను మా అమ్మ అలా తయారు చేసిందని, మనుషుల ప్రాణాలు తనకు లెక్కలేదని అంటాడు. కన్నతండ్రినైన నన్నే చంపాలనుకుంది.. నా అనుమానం ఏంటంటే దశరథ్ అన్నయ్యకు బుల్లెట్ తగిలేందుకు కూడా నా కూతురే (జ్యోత్స్న) కారణం అయి ఉండాలని దాసు చెప్తాడు. దీపను చంపాలనుకున్నది నా కూతురే అయి ఉండాలని అనుమానిస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మామూలుగా ఉంటే ఎవరికి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియదని అంటాడు. ఎవరికి ఏమి కాకుండా ఉండాలంటే నిజం చెప్పేయాలని, తన తల్లికి, జ్యోత్స్నకు గట్టిగా బుద్ది చెప్పాలని దాసు అంటాడు. దీపే నీ అసలైన కూతురు అని దశరథ్‍కు చెప్పేస్తాను.. వెళదాం పదా అని దాసు అంటాడు.

చెప్పగానే వాళ్లు నమ్ముతారని అనుకుంటున్నావా.. ఈ మధ్యే నా మీద వారికి నమ్మకం పోయింది. నీపై ముందు నుంచి లేదు. నువ్వు చెప్పగానే జ్యోత్స్న ఒప్పుకుంటుందా. పారిజాతం అమ్మమ్మ నిజాలు చెబుతుందా అని కార్తీక్ అంటాడు. ఒప్పిస్తానని దాసు అరుస్తాడు. ఇంటి వారసురాలి విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తే నమ్ముతారా.. ఆధారాలు అడుగుతారని కార్తీక్ అంటాడు. నమ్మిస్తానని దాసు అంటాడు. ఎలా నిరూపిస్తావని కార్తీక్ అడుగుతాడు. నిజం చెప్పకపోతే కూతురని కూడా చూడనని దాసు ఆవేశంగా అంటాడు. అసలు నిన్ను గుమ్మంలోకే రానివ్వరని కార్తీక్ వారిస్తాడు. జరిగింది విన్న నాకే ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది.. ఇన్నాళ్లు ఈ విషయాన్ని పారిజాతం అమ్మమ్మ మ్యానేజ్ చేసిందంటే ఎప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారని కార్తీక్ అంటాడు. మాములు గానే దీప అంటే వాళ్లకు పడదు.. అలాంటిది దీపే అసలైన వారసురాలు అంటే నీకు మతిస్థిమితం లేదని అందరు నమ్ముతున్నారు.. ఇప్పుడు నాకు కూడా మతిస్థిమితం లేదని అనుకుంటారని కార్తీక్ అంటాడు.

నిజాలు చెప్పకపోతే హత్యాయత్నాలు ఇంతటితో ఆగవని దాసు అంటాడు. ఆస్తి కోసం దశరథ్ అన్నయ్యను, సుమిత్ర వదినను, శివన్నారాయణను కూడా చంపేస్తారని జ్యోత్స్న, పారిజాతం గురించి దాసు అంటాడు. దీప విషయం వేరే వాళ్లకు తెలిసి భయపడితేనే అలా జరగుతుందని, ఈ నిజం ఇంకా బయట ఎవరికి తెలుసని కార్తీక్ అడుగుతాడు. ఇక ఎవరికి తెలియదని అంటాడు దాసు. ఈ విషయాలన్నీ ఎవరితో చెప్పకు.. మనం ఇకనుండి వాళ్ళని గమనిద్దామని దాసుతో జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. తరువాయి భాగంలో దీప కళ్ళు తెరిచి చూస్తుంది. ఎలా ఉన్నావని కార్తీక్ అడుగగా.. బానే ఉన్నా అన్నట్టుగా తలాడిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.