English | Telugu

Karthika Deepam 2 :దీపని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్న కార్తీక్.. పారిజాతం ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -192 లో..... దీపని చూసి కార్తీక్ ఫ్రెండ్స్ పనిమనిషి అనుకుంటారు. తను పనిమనిషి కాదు నా భార్య దీప అంటూ దీప భుజంపై కార్తీక్ చెయ్ వేస్తాడు. తను నా కూతురు శౌర్య.. ఇది నా కుటుంబమని కార్తీక్ అనగానే.. వాళ్ళు షాక్ అవుతారు. నీకు పెళ్లి ఎప్పుడైందంటూ అడుగుతారు.. అదో పెద్ద కథ అని కార్తీక్ అనగానే.. కానీ తనను చుస్తే అలా లేదని అంటారు. మరి ఎలా ఉంది పల్లెటూర్ లాగా ఉందా కానీ తన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరని దీప గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. వాళ్ళు సారీ చెప్పి వీలైతే భోజనానికి రండి అని చెప్పి వెళ్ళిపోతారు.

మరొకవైపు జ్యోత్స్నకి ప్లాన్ చెప్తుంది పారిజాతం. మీ తాత దగ్గరికి వెళ్లి.. కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు.. కార్తీక్ ని తప్ప ఎవరిని చేసుకునని సింపథీ వచ్చేలా మాట్లాడమని పారిజాతం చెప్తుంది. దానికి జ్యోత్స్న సరే అంటుంది. మరొకవైపు కాంచన, దీప, అనసూయ మాట్లాడుకుంటుంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. నేను మీ భార్య స్థానానికి పనికి రానని దీప అంటుంది. ఎవరేం అనుకున్నా నాకు అవసరం లేదు. అందరికి తెలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నావ్ కదా.. ఇక అందరికి తెలిసేలా చేస్తాను. నా భార్య గురించి కూతురు గురించి అని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత నేను నాలాగే ఉంటానని దీప అంటుంది.

ఆ తర్వాత శివన్నారాయణ‌ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. కాళ్ళు పట్టుకొని సారీ అడుగుతుంది. నువ్వు నాకు శత్రువు కాదు.. ఈ ఆస్తులకి వారసురాలివి.. నువ్వు చెప్పినట్టు వినాలని శివన్నారాయణ‌ అనగానే వింటానని జ్యోత్స్న అంటుంది. అయితే పెళ్లి చేసుకోమని శివన్నారాయణ అంటాడు. నేను బావని తప్ప ఎవరిని చేసుకోనంటూ జ్యోష్న కోపంగా మాట్లాడుతుంది. నేనేం చెప్పి పంపించాను ఇదేం చేస్తుందని పారిజాతం అనుకుంటుంది. ఆ తర్వాత దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. పారిజాతం అందరి గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. కాశీ, స్వప్న ఇద్దరు తనపై కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.