English | Telugu

బ్యాడ్ వర్డ్ వాడిన గౌతమ్.. మదర్ ప్రామిస్ అలా అనలేదు!

బిగ్ బాస్ మెగా చీఫ్ అవ్వడానికి జరిగిన టాస్క్ లలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నోరు జారుతూనే ఉంటారు. మళ్ళీ అది రియలైజ్ అయి సారీ చెప్తుంటారు. అయితే ఈ వారంలో టాస్క్ లో భాగంగా నిఖిల్, గౌతమ్ కి పెద్ద గొడవనే జరిగింది. అందులో గౌతమ్, నిఖిల్ ఇద్దరు నువ్వా నేనా అంటు గొడవకి దిగారు.

అదే విషయమై గౌతమ్, నిఖిల్ ని నాగార్జున వివరణ అడుగుతాడు. సర్ తను సైలెంట్ గా ఎదో అబ్యూజ్ వర్డ్ వాడాడు. అందుకే నాకు కోపం వచ్చిందంటూ నిఖిల్ చెప్తాడు. ఆ కోపంలో కొంచెం గట్టిగా అరిచాను కానీ నేను అబ్యూజ్ వర్డ్ మాత్రం వాడలేదని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత నాగార్జున వీడియో ప్లే చేసి చూపిస్తాడు. అందులో ఏదో వర్డ్ సైలెంట్ వాడినట్లు ఉంటుంది. అది చూసి సర్ నా మైండ్ లో ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ అయితే లేదు మదర్ ప్రామిస్ అంటూ గౌతమ్ అంటాడు. నువ్వు అన్నది అబ్యూజ్ వర్డ్ కాకపోతే.. నువ్వు ఎందుకు సైలెంట్ గా అన్నావ్. బయటకు అనొచ్చు కదా అని నాగార్జున అంటాడు. అది అబ్యూజ్ వర్డ్ వాడినట్లు అయితే ఈ క్షణమే ఇంటి నుండి వెళ్ళిపోతాను సర్ అంటాడు గౌతమ్.

ఆ తర్వాత ఆ విషయం గురించి నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ అడుగుతాడు. అందరు కూడా అలా సైలెంట్ గా ఆ వర్డ్ వాడాడు. కాబట్టి అది అనకూడని వర్డ్ అయి ఉంటుందని హౌస్ మేట్స్ అంటారు. నువ్వు ప్రామిస్ వేసావ్ ఒకవేళ అనవసరంగా నేనే ఉహించుకొని ఉంటే సారీ.. ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మనే అని స్కిప్ చేస్తున్నట్లుగా నిఖిల్ ఆ విషయం గురించి చెప్పుకొచ్చాడు. దానికి గౌతమ్ సారీ చెప్తాడు. ఇక ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని నాగార్జున చెప్తాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.