English | Telugu

Jabardasth new judge : జబర్దస్త్ కి కొత్త జడ్జ్.. శివన్న వచ్చాడు!

జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఇష్టంగా చూసే షో. 2013 లో మొదలైన ఈ షో లో ఎంతో మంది కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. నాగబాబు, రోజా జడ్జ్ లుగా అనసూయ భరద్వాజ్ యాంకర్ గా మొదలైన ఈ షోలో ఎన్నో మార్పులు వచ్చాయి. (Jabardasth)

నాగబాబు, రోజా తర్వాత మను, ఇంద్రజ కొన్ని రోజులు జడ్జులుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఖుష్బు జబర్దస్త్ కి న్యాయనిర్ణేతగా చేస్తుంది‌. ఇక తాజాగా నటుడు శివాజీ( బిగ్ బాస్ సీజన్ సెవెన్ శివన్న) కొత్త జడ్జ్ గా వచ్చేశాడు. ఇక కామెడీ కొత్త పుంతలు అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. జబర్దస్త్ షోలో కూడా కొత్త కమెడియన్లు వచ్చారు. భాస్కర్, ఇమ్మాన్యుయల్, నూకరాజు, తాగుబోతు రమేశ్, కెవ్వు కార్తిక్, పటాస్ ప్రవీణ్ ఇలా కొత్తవారితో పాటు సీనియర్ కమెడియన్ రాకెట్ రాఘవ కూడా ఉన్నాడు. ఇక కొత్తగా వచ్చిన శివాజీకి యాంకర్ రష్మీ, జడ్జ్ ఖుష్బు గ్రాంఢ్ వెల్ కమ్ చెప్పారు. శివాజీ వచ్చీ రాగానే సీనియర్ కమెడియన్ రాకెట్ రాఘవతో కాసేపు ఆడుకున్నాడు. రాఘవ తన స్కిట్ లో.. ఇందాకటి నుండి చూస్తున్నాను టీమ్ లీడర్ ని ఏంటి అక్కడ కూర్చొబెట్టారని శివాజీని చూసి ఆమె అడుగగా.. అతను టీమ్ లీడర్ కాదు జడ్జ్ . ఏదో నాలాగా యంగ్ గా ఉంటారు అంతే అని రాఘవ అంటాడు. "మరీ నీ అంత యంగ్ కాదు రాఘవ నేను.. ఎప్పుడో ఎస్వీ రంగారావు గారు మీరు" అంటు శివాజీ అనగానే షో అంత పగలబడి నవ్వేశారు.

ఇక రాకెట్ రాఘవ అయితే శివాజీ మాటలకి కడుపుబ్బా నవ్వేశాడు. ఇక కొత్త జడ్జ్ గా శివాజీ రాగానే జబర్దస్త్ లో కామెడీ ట్రాక్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. సుడిగాలి సుధీర్, వేణు వండర్స్, కిర్రాక్ ఆర్పీ, శకలక శంకర్, చమ్మక్ చంద్ర టైమ్ లో కామెడీ అంటే జబర్దస్త్ షో చూడాల్సిందే అనేలా‌ ఉండేది. వాళ్ళ కామెడీని ఫ్యామిలీతో కలిసి చూస్తూ నవ్వుకునేవారు. మరి ఇప్పుడు జబర్దస్త్ లో అలనాటి నవ్వులు ఉంటాయో లేదో చూడాలి. తాజాగా యూట్యూబ్ లో శుక్రవారం నాటి జబర్దస్త్ ఎపిసోడ్ రిలీజైంది. దానికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. ట్రెండింగ్ లో ఉన్న ఈ ఎపిసోడ్ చూసేయండి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.