English | Telugu

Abhay Naveen Eliminated : అభయ్ నవీన్ ఎలిమినేటెడ్.. బిగ్ బాస్ ని తిట్టడమే కారణమా?

బిగ్ బాస్ పెద్ద మెంటల్ గాడు.. దిమాక్ లేదు.. ఇలాంటి పనికి మాలిన టాస్క్‌లు పెడుతున్నాడు.. అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో బిగ్ బాస్‌కే తెలియదు.. ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడల్లా టాస్క్‌లు మార్చేస్తున్నాడు.. అన్నీ లఫంగి ఎడిట్‌లు చేస్తాడు.. నువ్వు అసలు బిగ్ బాస్ కాదు.. బయాస్డ్ బాస్.. నేను బయట ఇంటర్వ్యూలకు వెళ్లినా కూడా ఇదే మాట చెప్తాను అంటూ బిగ్ బాస్‌ని బండబూతులు తిట్టాడు అభయ్ నవీన్. ఇక అభయ్ మాట్లాడిదంతా బిబి పెద్ద టీవీలో వేసి చూపించాడు నాగార్జున. ఫుల్ ఫైర్ తో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చి మరీ.. అభయ్‌ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పొమ్మన్నాడు.

అసలు అభయ్ ఈ వారం ఏం చేశాడో చూసేద్దాం... ఈ వారంలో ప్రభావతి గుడ్డు టాస్క్ మంచి రసవత్తరంగా సాగింది. అభయ్ వర్సెస్ నిఖిల్ టీమ్ లు పోటీపడాల్సి ఉండగా.. అభయ్ ఈ టాస్క్‌లో చేతులు ఎత్తేయడం కాదు.. కాళ్లు కూడా ఎత్తేశాడు. చీఫ్‌గా తాను ముందు ఉండి తన టీంని నడిపించాల్సింది పోయి.. మనోడు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. తాను ఆడకుండా ఉండటమే కాకుండా.. తన టీం సభ్యుల్ని కూడా ఆడకుండా చేశాడు. ఓ వైపు తన టీమ్ లో ఉన్న ఆడపిల్లలు.. యష్మీ గౌడ, ప్రేరణలు మగాళ్లతో పోటీ పడి గేమ్ ఆడుతుంటే.. మనోడు మాత్రం ఆ బుట్టల దగ్గర లేదంటే సోఫాలో కూర్చుని రిలాక్స్ అయ్యేవాడు. తన టీమ్ కష్టపడి సంపాదించిన గుడ్లను సైతం కాపాడలేకపోయాడు అభయ్.

ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ బిగ్ బాస్ రూల్సే ఉంటాయి. కచ్చితంగా ప్రతీ ఒక్కరు బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అంటు అభయ్ కి రెడ్ కార్డు చూపిస్తూ.. బిగ్ బాస్ ఓపెన్ ది గేట్స్ అని అనేశాడు నాగార్జున. దాంతో హౌస్ అంతా షాక్ అయ్యారు. అభయ్ ఎంత బ్రతిమాలిన నాగార్జున వినలేదు. ఇక హౌస్ లోని వాళ్ళని ఒక్కొక్కరిని అడిగాడు నాగార్జున. అందరు అభయ్ కి ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పారు. మారే అవకాశం ఇద్దామని చెప్పారు. దాంతో బిగ్ బాస్ ని నాగార్జున రిక్వెస్ట్ చేశాడు. ఇక మీదట ఏ కంటెస్టెంట్ ఇలా ప్రవర్తించిన డైరెక్ట్ గేట్ బయటకే, నేను వచ్చేవరకు కూడా బిగ్ బాస్ ఆగడు అని నాగార్జున చెప్పేశాడు. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్నవారిలో ఎవరిని సేవ్ చేయలేదు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.