English | Telugu

హామీద వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్రహ్మముడిలో కొత్త క్యారెక్టర్!


బ్రహ్మముడిలో న్యూ క్యారెక్టర్ ఎంట్రీ , హమీద వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటని అనుకుంటున్నారా.. అసలు సంబంధమేంటి అనుకుంటున్నారా.. సంబంధం ఉంది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న అలియాస్ హామీద సీరియల్ మొదట నుండి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్- 5 లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆకట్టుకుంది. హౌస్ లో సింగర్ శ్రీరామ్ చంద్రతో ప్రేమాయణం నడిపింది. దాంతో ఈ బ్యూటీ ఎక్కువ రోజులే హౌస్ లో ఉంది.

అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక హమీద వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఇక అప్పుడే.. అదే సీజన్లో మానస్ ఎంట్రీ ఇచ్చాడు. మానస్ హీరోగా బ్రహ్మముడి సీరియల్ మొదలైంది. దాంట్లో హీరోయిన్ కి అక్కగా.. హీరోయిన్ రేంజ్ లో అప్పియర్ వచ్చేసింది. ఈ సీరియల్ లో ఇంపార్టెంటెన్స్ పాత్ర హామీదకి పేరు తెచ్చింది. అందులో స్వప్న బయటకు కన్పించే అంత క్యూట్ గా కాకుండా.. ఒకరకంగా మొదట విలన్.. ఆ తర్వాత మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ సీరియల్ లో స్వప్న తన నటనతో ఇంప్రెస్ చేస్తోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుంది. అయితే ఈ వారమే బిగ్ బాస్ 2.0 గా లాంఛ్ కానుంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా హామీద ఎంట్రీ ఇస్తుంది. దీనికి పక్క ఆధారం కూడా ఉంది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో మరొక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది. అంటే హామీద బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫమ్ అయినట్లే.. ఇక హామీద ఎంట్రీ ఇస్తుందంటే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదని అందరు అనుకుంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.