English | Telugu

జ‌బ‌ర్ద‌స్త్‌లో ఫాహిమా టైమ్ మొద‌లైంది!

జబర్దస్త్ అంటే ప్రేక్షకులకు గుర్తొచ్చేవి రెండే. ఒకటి... కామెడీ. రెండు... గ్లామర్. ఆర్టిస్టులు చేసిన కామెడీ కంటే ఒక్కోసారి యాంకర్లు అనసూయ, రష్మీ వేసిన డ్రస్సులు హాట్ టాపిక్ అవుతుంటాయి. గ్లామర్ షో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. 'జబర్దస్త్'లో అమ్మాయిలు అంటే అందమే హైలైట్ అవుతుంటుంది.

అందంతో కాకుండా కామెడీ టైమింగ్‌తో లేడీ కమెడియన్ ఫాహిమా కొట్టుకొస్తోంది. కలర్, లుక్స్ పరంగా చూస్తే అనసూయ, రష్మీ, వర్షలతో ఫాహిమాను కంపేర్ చేయలేము. కానీ, ఆమెకు రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. రెండు మూడు ఎపిసోడ్ల నుండి ఫాహిమా రెచ్చిపోతోంది. 'బులెట్' భాస్కర్ టీమ్ లో ఫైమాకు మంచి రోల్స్ పడ్డాయి. లేటెస్ట్ గా రిలీజైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ లో ఆమెకు రోల్ దక్కింది. వచ్చిన ఛాన్స్ దక్కించుకుని మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అందుకు యూట్యూబ్ లో కామెంట్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సాధారణంగా 'జబర్దస్త్' ప్రోమో కింద హైపర్ ఆది గురించి, 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో కింద సుడిగాలి సుధీర్ గురించి ఎక్కువమంది కామెంట్లు చేస్తారు. కానీ, లేటెస్ట్ ప్రోమో కింద ఫాహిమా గురించి ఎక్కువమంది కామెంట్లు చేశారు. ఆడియన్స్ ఫాహిమాను మెచ్చుకుంటూ పోస్టులు చేశారు. ఇకనుండి జబర్దస్త్ షోలో ఫాహిమా టైమ్‌ మొదలైందని చెప్పవచ్చు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.