English | Telugu

1980ల‌లోకి తీసుకెళ్లిన 'ఢీ 14'

'ఢీ 14' రాబోయే ఎపిసోడ్ మొత్తం కూడా 1980లోకి తీసుకెళ్లబోతోంది. ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జెస్ గా గణేష్ మాస్టర్, శ్రద్ధా దాస్, నందిత శ్వేతా హాజరయ్యారు. అలనాటి సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు కంటెస్టెంట్స్ అంతా అప్పటి హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ తో డాన్సులు చేసి మైమరిపించారు. "సామజ వరగమనా "సాంగ్ కి జ్ఞాన్‌ సాహు, రిషిక డాన్స్ ఇరగదీశారు. "కుర్రాడు బాబోయ్" పాటకు కూడా మంచి ఊపుతో డాన్స్ చేశారు. ఇక ప్రదీప్ కూడా మంచి జోష్ స్టెప్పులేసి అందరినీ మరింత హుషారెత్తించాడు. సుశాంత్ స్పెషల్ గెస్ట్ గా ఈ షోకి వచ్చాడు.

ఇక జతిన్ టీం "నా కళ్ళు చెబుతున్నాయి"కి డాన్స్ చేసేసరికి శ్రద్ధా దాస్ "కన్నార్పకుండా చూసాను" అని కామెంట్ చేసింది. ఆది సోఫా చూసి "చిన్న సైజు ఫ్యామిలీలా ఉంది" అంటాడు ప్రదీప్. "హలో ఫామిలీ ఫోటో ఏంటి ఫ్యామిలీయే" అంటూ డాన్సర్ తేజస్విని తన భార్య అని, చైల్డ్ కంటెస్టెంట్స్ ముగ్గురు తమ పిల్లలని చెప్తాడు ఆది. "ఏమే వాన సాంగ్ చూసావ్ కదా మనం కూడా అలా వానలోకి వెళ్లి డాన్సులు చేయాలి" అంటాడు తేజుతో ఆది. "ఎండిపోయిన మొక్కకు ఎండైతే ఏమిటి, వానైతే ఏమిటి" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది తేజు. "వద్దు ఒక్క పిల్లాడితో ఆగుదాం అంటే ముగ్గుర్ని కన్నది" అంటాడు మళ్ళీ ఆది. ఇలా ఈ వారం ఎపిసోడ్ ప్రోమో సందడి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.