English | Telugu

అనసూయ ఆగుతుందా.. సాగుతుందా?!

అనసూయ 'జబర్దస్త్' షోకి బై బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ షోకి నిజంగానే బై బై చెప్పిందా లేదా, కంటిన్యూ చేస్తుందా అనే విషయంలో సందేహాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ 'జబర్దస్త్' షూటింగ్ కోసం ఒక అద్భుతమైన బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్న ఒక ఫోటో తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసిన అనసూయ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే హైట్ కి తగ్గ వెయిట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వాడినా బాగుంటుంది. ఈ రోజు సోషల్ మీడియాకి రిలీజ్ చేసిన పిక్ చూస్తే.. ట్రెడిషనల్ గా, పద్ధ‌తిగా కనిపిస్తోంది.

2013లో 'జబర్దస్త్' షో మొద‌లైన‌ దగ్గరనుంచి అనసూయ చేస్తోంది. ఇక మూవీస్ లో కీ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది. ఆమె న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ జూలై 1న రిలీజ‌వుతోంది. 'దర్జా' మూవీ త్వ‌ర‌లో రిలీజ్ కాబోతోంది. 'పుష్ప 2', 'రంగ మార్తాండ' మూవీస్ లో నటిస్తోంది. లేటెస్ట్ గా 'సింబల్' అనే టైటిల్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్లు చెప్పింది అనసూయ. "ఇలా నిటారుగా నిలబడడం అంటే నాకు చాలా ఇష్టం" అనే కాప్షన్ తో ఫొటోస్ పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఫాషన్ ఐకాన్ , క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా అనసూయ జబర్దస్త్ స్టేజి మీద ఆగిపోతుందా, కంటిన్యూ అవుతుందా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.