English | Telugu

బొమ్మలు హలీం అమ్మి చదువుకున్నాడు!

సరిగమప సింగింగ్ సూపర్ స్టార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న షో. ఇందులో ఈ వారం ముందుగా పార్వతి "కిటకిట తలుపులు" సాంగ్ పాడి ఫినాలే కి గోల్డెన్ టికెట్ అందుకుంది. తర్వాత డేనియల్ రాజు "నీ మనసే" అనే సాంగ్ పాడి స్టేజిని హుషారెత్తించాడు. డేనియల్ రాజు సాంగ్ ని ఈ షోకి వచ్చిన నవదీప్ కూడా స్టేజి ఎక్కి డేనియల్ తో కలిసి పాటందుకుని అందరినీ మెప్పించాడు. నా పాటకు ఎన్ని మార్కులు ఇస్తారంటూ కోటి గారిని కాసేపు ఆట పట్టించాడు. చాలా బాగా పడ్డావ్ అంటూ కోటి గారు మెచ్చుకుంటారు.

ఇక ఇదే స్టేజి మీదకు డేనియల్ రాజు ఫ్రెండ్ మూర్తిని స్టేజి మీదకు పిలుస్తుంది శ్రీముఖి. ఇక అతను డేనియల్ రాజు గురించి తాను లైఫ్ లో పడిన కష్టాలు గురించి చెప్పి అందరినీ కంట తడి పెట్టించాడు. డేనియల్ రాజు చాలా అంటే చాలా పేదరికం నుంచి తిండి కూడా సరిగా లేని పరిస్థితి నుంచి ఎదిగిన వ్యక్తిగా తన గురించి తెలియని ఎంతో మందికి చెప్పాడు. తాను చదువుకోవడానికి డబ్బులు కూడా లేనప్పుడు రెస్టారెంట్ లో పని చేసి వచ్చిన డబ్బులతో తాను చదువుకోవడమే కాదు తనను కూడా చదివించాడని చెప్పుకొచ్చారు మూర్తి. రంజాన్ టైంలో హలీం అమ్మడమే కాదు బొమ్మలు కూడా అమ్మి తన కోసం ఎంతో చేసాడని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి తనకు పాటలు ఎంతో ఇష్టమని అందరిని తనంటే చాలా ఇష్టం అని చెప్పాడు.

ఇక ఒకానొక టైంలో తనకు తన చెల్లెలికి కష్టం వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు మూర్తి మాత్రమే వచ్చి చెయ్యి ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు డేనియల్. అందరి జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవని ఇలాంటి ఘటనలు చదివేటప్పుడు, వినేటప్పుడు అనిపిస్తుంది. ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.