English | Telugu
Brahmamudi : కావ్యకి క్యాన్సర్.. తప్పుగా అర్థం చేసుకున్న రాజ్!
Updated : Aug 12, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -797 లో..... కావ్య హాస్పిటల్ కి వెళ్లి బేబీ ఎలా ఉందో చెక్ చేసుకొని వస్తానని అపర్ణకి చెప్పి వెళ్తుంది. కావ్య హాస్పిటల్ కి వెళ్తుంటే రాజ్ కి కన్పిస్తుంది. వాళ్ళ ఆఫీస్ అటు కదా ఇటు వెళ్తుంది ఏంటని కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. నేను ఆఫీస్ కి వెళ్తున్నానని చెప్పి కావ్య ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి అబద్ధం చెప్తున్నారు.. ఒకవేళ నన్ను రిజెక్ట్ చెయ్యడానికి కారణం ఇదే అయి ఉంటుంది.. వెళ్లి కనుక్కోవాలని కావ్యని ఫాలో అవుతాడు రాజ్.
ఆ తర్వాత కావ్య హాస్పిటల్ కి వెళ్తుంది. గైనకాలజిస్ట్ రూమ్ రెనొవేషన్ లో ఉండగా ఆ డాక్టర్ అంకాలాజిస్ట్ రూమ్ లో కూర్చొని ఉంటుంది. డాక్టర్ దగ్గరికి కావ్య వెళ్తుంది. కావ్యని చూసి టెస్ట్ చేసి బేబీ బాగుంది కంగ్రాట్స్ అని చెప్తుంది. రాజ్ వచ్చి చాటుగా వింటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఎందుకు టెస్ట్ చేపించుకోలేదు.. ఇప్పటికే లేట్ అయిందని డాక్టర్ అంటుంది. డాక్టర్ దేని గురించి మాట్లాడుతున్నారు అని రూమ్ బయట నేమ్ ప్లేట్ చూస్తాడు. ఏంటి అంకాలజిస్ట్ అని ఉంది.. అంటే కళావతి గారికి క్యాన్సరా.. అందుకే నన్ను రిజెక్ట్ చేసిందా అని రాజ్ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి ఈయన ఇక్కడున్నారు కొంపదీసి విన్నారా అని అనుకుంటుంది. మీకు క్యాన్సర్ అని ఎందుకు చెప్పలేదు.. మీకు నేనున్నాను అంటూ భారీ డైలాగ్ లు కొడుతు ఎమోషనల్ గా మాట్లాడతాడు రాజ్. మీరు ఆ గదిలో నుండి వస్తున్నారు అంటేనే నాకు అర్ధం అయిందని రాజ్ అనగానే కావ్య బోర్డ్ చూసి ఓహ్ ఆయనకు అలా అర్ధమైందా అని కావ్య అనుకుంటుంది.
ఆ తర్వాత కావ్య ఇంటికి వెళ్లి అపర్ణకి లోపల బేబీ బాగుంది అంట అని చెప్తుంది. అప్పుడే రాజ్ వచ్చి నా దగ్గర కళావతికి క్యాన్సర్ అన్న విషయం ఎందుకు దాచారని అపర్ణ, ఇందిరాదేవీలని రాజ్ అడుగుతాడు. అయ్యో అదేం లేదు కావాలంటే డాక్టర్ నా ఫ్రెండ్ కాల్ చేస్తానని చేస్తుంది. ప్రియా నా బాడీ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతుంది. లేదని డాక్టర్ చెప్తుంది. విన్నారా అని కావ్య లోపలికి వెళ్తుంది. తరువాయి భాగంలో తను ప్రెగ్నెంట్ అని కళ్యాణ్ కి అప్పు చెప్తుంది. ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు మామిడికాయ తీసుకొని వచ్చి ఇలా ఉన్నవాళ్లకి తినాలనిపిస్తుంది అంట తిను అని కావ్యకి ఇస్తుంది. అది చూసిన రుద్రాణి.. నువ్వు తినాలి కానీ కావ్యకి ఇస్తున్నావ్ ఏంటి? మీ అక్క ఏమైనా ప్రెగ్నెంటా అని రుద్రాణి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.