English | Telugu

Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళికి ఒకే చెప్పిన శివన్నారాయణ.. కాంచన హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -433 లో...... బావ అలా కోరిక కోరడం వెనుక నీ హస్తం కూడా ఉంది కదా.. అసలు నీ ఉద్దేశం ఏంటి దీప అని జ్యోత్స్న అడుగుతుంది. ఉద్దేశం ఏముందని కార్తీక్ అంటాడు. మరి వేరే ఎక్కడ అయినా బయట అలా ఎవరి చేత్తో తగిలి తాళి తెగిపోతే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మనాన్నలు దీప అమ్మనాన్నలుగా ఉండి పెళ్లి చేయమంటావా అని జ్యోత్స్న అడుగుతుంది.

ఏం అడిగావే అది శివన్నారాయణ మనవరాలు అంటే అని పారిజాతం ఓవర్ యాక్షన్ చేస్తుంది. మరి ఇంతకు ముందు మీ ఇంట్లో పని చేసిన వాళ్ళ తాళి తెంపలేదు కానీ దీప తాళి ఎందుకు తెంపావని కార్తీక్ అనగానే అది బావ అంటే అంటూ కార్తీక్ గురించి గొప్పగా దీప పోగుతుంటుంది. ఏం కౌంటర్ వేసావే అని పారిజాతం అంటుంది. దీపని అలా చెయ్యడానికి పాత పగలు చాలా ఉన్నాయని పారిజాతం అనగానే మేం ఇలా చెయ్యడానికి మాకు చాలానే ఉన్నాయని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శివన్నారాయణకి దీప కాఫీ తీసుకొని వస్తుంది. కాంచన ఎలా ఉందని శివన్నారాయణ అడుగుతాడు. కాంచన గురించి చెప్తూ శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు.

పెద్దసారు మేం వెళ్తాము ఇక.. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని కార్తీక్ అడుగుతాడు. సుమిత్ర వాళ్ళని పిలుస్తుంది పారిజాతం. అందరు వస్తారు మీ పెళ్లి జరుగుతుందని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. సుమిత్ర కోపంగా లోపలికి వెళ్తుంది. కార్తీక్, దీప ఇంటికి వచ్చి కాంచనకి పెళ్లి గురించి చెప్తారు. ఈ రోజు మీ నాన్న దీపతో నీ గురించి గొప్పగా చెప్పారు అమ్మ అని కార్తీక్ అనగానే ఏం అన్నారని సంతోషంగా అడుగుతుంది కాంచన. అప్పుడే కార్తీక్ ఏదో ఫోన్ వచ్చి బయటకు వెళ్తాడు. ఈ టైమ్ లో బావ కి ఎవరు కాల్ చేసారని దీపకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.