English | Telugu

Brahmamudi : గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూపర్ ట్విస్ట్.. రాహుల్ అరెస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -504 లో.. కళ్యాణ్ తో అటో దిగాక కావ్య మాట్లాడుతుంది. నువ్వు ఎంచుకున్న దారి కరెక్ట్ కానీ అక్కడే ఆగిపోకు.. ఇదే నీ గోల్ కాదు.. నీ గోల్ ని చేరుకోవడానికి ఇది ఒక దారి అని కళ్యాణ్ ని కావ్య మోటివేట్ చేస్తుంది. నువ్వు అనుకున్నది.. నువ్వే సాధించి చూపించపని కావ్య వెళ్తు.. ఛార్జి డబ్బులు చేతిలో పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ హాల్లో కూర్చొని బుక్ చదువుతుంటే.. తనకి ఛాతిలో నొప్పి లేస్తుంది. అది గమనించిన సుభాష్ దగ్గరకి వస్తుంటే వద్దని అపర్ణ అంటుంది. సుభాష్ వెళ్లి రాజ్ ని తీసుకొని వస్తాడు. రాజ్ అపర్ణ దగ్గరికి వస్తాడు. సుభాష్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.

ఆ తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసాక.. మీకు తనపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం.. ఆవిడ టాబ్లెట్స్ వాడడం లేదు.. ఇది వరకే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి కదా అని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది కావ్య అవసరం ఉంటేనే అత్తని పట్టించుకుంటావా నీ అత్త ఏమో నీ గురించి గొప్పలు చెప్తుందని కావ్యని రుద్రాణి అంటుంది. కావ్యకి ఒక్కదానికేనా బాధ్యత.. నీకూ లేదా అంటు రుద్రాణికి చురకలు అంటిస్తుంది ఇందిరాదేవి. నాదే తప్పు నా అత్త గురించి నేనే పట్టించుకోవాలి.. ఇక నుండి అత్తయ్యని నేనే చూసుకుంటానని కావ్య అనగానే.. ఇదిగో టాబ్లెట్స్.. నువ్వు దగ్గర ఉండి చూసుకో.. నీకు వీలు కాకపోతే నేను చూసుకుంటానని రాజ్ అంటాడు. మరొక వైపు అప్పు దగ్గరకి కళ్యాణ్ వచ్చి అయిదు వందలు ఇస్తాడు. ఇదిగో నా మొదటి సంపాదన అని అనగానే.. జాబ్ వచ్చిందా అని అడుగుతుంది. వచ్చింది డేటా ఎంట్రీ అని చెప్తాడు. మరి నెలకు శాలరీ ఇస్తారు కదా అని అప్పు అనగానే మనకి డబ్బులు కావాలి కదా అందుకే డైలీ పేమెంట్ చెయ్యమన్నానని చెప్తాడు.‌ కానీ కళ్యాణ్ అటో నడుపుతున్నాడనే విషయం అప్పుకి చెప్తే బాధపడుతుందని అబద్దం చెప్తాడు.

మరుసటిరోజు దుగ్గిరాల ఇంటికి పోలీసులు వచ్చి.. అక్రమంగా బంగారం తరలిస్తుంటే పట్టుకున్నాము. అది మీ కంపెనీకి సప్లై అవుతుందని తెలిసింది.. అందుకే రాజ్ గారిని అరెస్ట్ చెయ్యడానికి వచ్చామని పోలీసులు అంటారు. రాహుల్ నువ్వే ఆఫీస్ కి వెళ్తున్నావ్? ఏంటి అని అందరు అడుగుతారు. నేను రెండు రోజుల నుండే ఆఫీస్ కి వెళ్తున్నాను.. నాకు తెలియదని రాహుల్ అంటాడు. రాజ్ చేసిన దానికి నా కొడుకుని అంటారని రుద్రాణి అంటుంది. కంపెనీ నాది కాబట్టి నేనే బాధ్యత వహిస్తానని పోలీసులకి రాజ్ కోవపరేట్ చేస్తానని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో నువ్వు ఫ్రాడ్ చేసి నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నావా అని రాజ్ ని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. కావ్య వచ్చి ఈ ఫైల్ తీసుకొని చుడండి‌ అన్ని మీకే తెలుస్తదని ఇన్‌స్పెక్టర్ కి కావ్య ఫైల్ ఇస్తుంది. అది చూసి ఇన్స్పెక్టర్ తప్పు చేసింది రాహుల్ అని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.