English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ లోడింగ్.. ఆ సర్ ప్రైజ్ ఎవరికంటే!


బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఫ్యామిలీ వీక్ ఉంటుంది. దానిలో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు రావడం.. వాళ్ళని చూసి కంటెస్టెంట్స్ కంటతడి పెట్టుకోవడం కామన్. సాధారణంగా ఇది బిగ్ బాస్ ముగిసే ముందు ఉంటుంది. కానీ ఇప్పుడు కాస్త తొందరగా మొదలెట్టేసాడు బిగ్ బాస్.

తాజాగా విడుదలైన ప్రోమోలో(Biggboss 8 Telugu) ఏం ఉందంటే.. మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్‌బాస్‌కి తెలుసు.. అందుకే ఐదుగురు సభ్యులకి వాళ్ల ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పాడు. ఇలా చెప్పగానే నిఖిల్, ఆదిత్య, నైనిక, సీత, అభయ్ ఇంటి నుంచి వచ్చిన బహుమతులను గార్డెన్ ఏరియాలో డిస్‌ప్లే చేశాడు బిగ్‌బాస్. అయితే బహుమతులు అందుకునే ఆ ఐదుగురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటిసభ్యుల బాధ్యతే అంటు బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక ఒక్కొక్కరు ఆ గిఫ్ట్ లతో వారి ఎటాచ్మెంట్ ని చెప్పుకొచ్చారు. ముందుగా నిఖిల్‌ తనకి వచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. "అది మా నాన్న షర్ట్.. నార్మల్‌గా అబ్బాయిలకి నాన్నకి హగ్గు ఇవ్వాలనే ఇది ఉండదు కాబట్టి.. ఆయనకి తెలీకుండా షర్ట్ దొంగతనం చేశా" అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలానే అభయ్ వాళ్ల నాన్నకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ గురించి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో మా నాన్నకి కొనిచ్చిన వాచ్ అది.. బతికున్నంత కాలం నాన్న అదే వాచ్ పెట్టుకున్నారంటూ అభయ్ ఎమోషనల్ అవడంతో సోనియా దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఇక ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న అబ్బాయి నన్న వదిలి వెళ్లిపోయిన తర్వాత నాకు ఓ ఫ్రెండ్ దొరికాడు.. ఐ మిస్ యూ కుమార్ అంటూ గిఫ్ట్ ని చూస్తు సీత కన్నీళ్లు పెట్టుకుంది. నైనిక తనకొచ్చిన గిఫ్ట్ ని చూస్తూ.. చాలా బాధపెట్టిన ఓ రిలేషన్‌షిప్ నుంచి నేను కోలుకున్నానంటే అది తనవల్లే అంటు నైనిక బాధపడింది. ఇక ఆ పర్సన్ ఇది చూసి నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నానంటు తన అవకాశాన్ని త్యాగం చేసి సీతకి ఇచ్చేశాడు అభయ్. అలానే నైనిక కోసం నిఖిల్ త్యాగం చేశాడు. ఇలా ప్రోమో అంతా ఎమోషన్స్‌తో సాగింది. తాజాగా వచ్చిన ఈ ప్రోమో(Biggboss 8 Telugu promo) మీరు ఓసారి చూసేయ్యండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.