English | Telugu

Bigg Boss 9 Winner Kalyan Padala: బిగ్ బాస్ సీజన్-9 విన్నర్ కళ్యాణ్ పడాల!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై వంద రోజులు పూర్తయింది. నిన్నటి నూట నాలుగవ ఎపిసోడ్ లో సంజన , కళ్యాణ్ పడాల జర్నీ వీడియోలతో ఫుల్ ప్యాక్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్ కి అందింది.

కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధారణ ఆటతీరుతో విశేష ప్రేక్షకాదరణ పొందాడు. నిన్నటి వరకు సాగిన ఓటింగ్ లో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా‌‌..తనూజ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఇమ్మాన్యుయేల్ ఉన్నాడు. నాల్గవ స్థానంలో డీమాన్ పవన్ ఉండగా సంజన అయిదో స్థానంలో ఉంది. అయితే కొన్ని ఓటింగ్ పోల్స్ లో మూడో స్థానంలో డీమాన్ పవన్ ఉన్నాడు. కానీ మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు టర్న్ లు.. అలాంటిది ఏది ముందే చెప్పలేం. కాబట్టి ఆదివారం రాత్రి వరకు సాగే ఈ ఫినాలే కోసం వెయిట్ చేయాల్సిందే.

కళ్యాణ్ పడాల ఓ సైనికుడు.. అన్నింటికి మించి సామాన్యుడు. అతడికి హౌస్ లో ఎంట్రీ అయిన నుండే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అయితే అమ్మాయిలని హగ్ చేసుకుంటాడు అనే రమ్య మోక్ష అన్నప్పుడు కుడా తను అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు. డీమాన్ పవన్ , కళ్యాణ్ మధ్య సాగిన ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో.. బ్యాక్ పెయిన్ తో డీమాన్ పడిపోయాడు. అప్పుడు కూడా కళ్యాణ్ గేమ్ ఆడలేదు.. ఎందుకంటే అపోజిట్ లో ఉన్న డీమాన్ పవన్ లేచి ఆడతాడేమోనని వెయిట్ చేశాడు. ఇది ఒక్కటి చాలు.. ఒక గేమర్ ఎలా ఉండాలో తెలియజేయడానికి. ఇమ్మాన్యుయేల్ తరుపున ఆడినప్పుడు ఓడిపోయాడు దాంతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు కళ్యాణ్. ఒక నిజమైన ఎమోషన్ ని కళ్యాణ్ లో ప్రతీ ఒక్క ఆడియన్ చూశాడు. అందుకే అతడికి ఓటింగ్ భారీగా పడింది. తనూజకి కళ్యాణ్ కి మధ్య ఇరవై శాతం ఓటింగ్ తేడా ఉందంటే అతను ఎంతమంది ప్రేక్షకులని గెలిచాడో అర్థం చేసుకోవచ్చు. తనూజ వర్సెస్ కళ్యాణ్ మధ్య సాగిన పోటీలో ఎవరు గెలిచారనేది తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.