English | Telugu
Brahmamudi: ఆ డైరెక్టర్ తో రాజ్ యాడ్ షూట్ చేస్తాడా?
Updated : Dec 21, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -909 లో... రాజ్ చేయబోయే యాడ్ ఫెయిల్ కావాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. దాంతో ఒక అతని దగ్గరికి వెళ్లి నీకు యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాను.. నువ్వు డైరెక్టర్ గా చెయ్యాలని రాహుల్ అనగానే అతను సరే అంటాడు. అతను హోటల్ లో పరోటా చేసే అతను.
మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వస్తాడు. యాడ్ షూట్ చెయ్యాలి ప్లీజ్ కావ్య ఒప్పుకో అని రిక్వెస్ట్ చేస్తాడు. నేను చెయ్యనని కావ్య అంటుంది. వద్దన్నా బ్రతిమిలాడుతావు ఏంట్రా.. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది.. అది మీ తాతయ్య నేను చేస్తామని ఇందిరాదేవి అంటుంది. ఇద్దరు కలిసి ఓల్డ్ స్టోరీని యాడ్ చేసి యాక్టింగ్ చేస్తారు. అది రాజ్ కి నచ్చదు.. అదంటే ఓల్డ్ గా ఉంది మేం చేసేది బాగుంటుందని అపర్ణ అంటుంది. అపర్ణ, సుభాష్ కలిసి వాళ్ళు ఒక యాడ్ యాక్టింగ్ చేస్తారు. అది కూడా రాజ్ కి నచ్చదు. అప్పుడే రాహుల్ మాట్లాడిన అతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడు. నా పేరు మణివర్మ అని చెప్తాడు. ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పెట్టుకున్నావని కావ్య అడుగుతుంది. వాళ్ళు ఇద్దరు డిఫరెంట్ మూవీస్ తీసారు.. నేను వాళ్ళ ఇద్దరిని కలిపి తీస్తానని అతను అనగానే మిమ్మల్ని ఎక్కడ చూడలేదని కావ్య అడుగుతుంది. అంటే నేను చాలా బిజీగా ఉంటానని డైరెక్టర్ అంటాడు.
ఆ తర్వాత డైరెక్టర్ యాడ్ కి సంబంధించిన స్టోరీ చెప్తుంటే.. అది కావ్యకి నచ్చదు. బంగారం అంటే అమ్మడం, తాకట్టు పెట్టడం కాదు.. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఎమోషన్ అని కావ్య చెప్పగానే.. బాగా చెప్పావ్ యాడ్ కాన్సెప్ట్ కూడా నువ్వే చెప్పమని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. సరే కానీ మోడల్ ఎక్కడ అని డైరెక్టర్ అడుగగా రాజ్, కావ్య వంక చూపిస్తాడు కానీ కావ్య అప్పుడే కింద ఏదో పడితే తీసుకుంటుంది. రాజ్ చూపించింది పనిమనిషి అనుకొని.. తన దగ్గరికి వెళ్లి డిస్కషన్ చేస్తాడు. దాంతో ఆవిడ పనిమనిషి.. మోడల్ నా భార్య అని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.