English | Telugu

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రభావతి 2.0 ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్ లో‌ మూడవ వారం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జోరుగా సాగుతున్నాయి. ‌ఒక్కో కంటెస్టెంట్ భావోద్వేగాలకి లోనవుతున్నారు.

తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ ఓ కోడిని సెటప్ చేసి , అందులో ఎగ్స్ ఉంచి, కంటెస్టెంట్స్ తీసుకోమని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ' బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి (prabavathi 2.0) ' అనే టైటిల్ తో వదిలిన ఈ ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఆదిత్య ఓం, పృథ్వీ ఇద్దరు ఫీజికల్ అయినట్టుగా తెలుస్తుంది.

విష్ణుప్రియ, యష్మీలకు గాయాలు జరిగినట్టుగా వారి ఆర్గుమెంట్స్ బట్టి తెలుస్తుంది‌. నిన్న జరిగిన టాస్క్ లో అభి, నిఖిల్, సోనియా, యష్మీల మధ్య గొడవ జరుగగా..‌ ఇప్పుడు ఆదిత్య ఓం, పృథ్వీ, యష్మీ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరి మధ్య గొడవ జరిగిందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ''ప్రభావతి 2.0 ' టాస్క్ బిగ్ బాస్ అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ ప్రోమోని మీరు చూసారా? చూస్తే కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.