English | Telugu

Eto Vellipoyindhi Manasu : యాగం ఆపడానికి దుష్టశక్తులు ప్రయత్నం.. మరి అది జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 204 లో.....యాగం ఆపాలని శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. శ్రీలత యాగం పనులు చేస్తుంటే.. మాణిక్యం వద్దని అనడం తో మాణిక్యాన్ని రెచ్చగొట్టి యాగం ఆపాలని శ్రీవల్లి అనుకుంటుంది. మాణిక్యంతో మా అత్తయ్యతో అలా అంటావా అని అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. చూడండి బావ గారు అత్తయ్యని అలా అన్నాడంటూ చెప్తుంది.. నేను అలా అనలేదని మాణిక్యం అంటాడు. అప్పుడే స్వామిజీ కలుగుజేసుకుని అలా అంటే తప్పేంటి ఇది పవిత్రమైంది.. అందుకే అందరు ముట్టుకోకుడదు అన్నాడని అనగానే.. అందరు సైలెంట్ అయిపోతారు.

ఆ తర్వాత ఇంకా స్వామి రాలేదని పెద్దాయన అంటాడు. సీతాకాంత్ స్వామికి ఫోన్ చేస్తుంటే కలవదు. తను రాడని తెలిస్తే గుండె ఆగిపోతుందేమోనని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక ఇది ఎలా చేస్తావ్ రామలక్ష్మి అని శ్రీలత అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకో స్వామి ఫోన్ మాట్లాడుతు.. స్వామికి ఆక్సిడెంట్ అయిందా అంటూ షాక్ అవుతాడు. దాంతో అందరు ఇక యాగం ఆగినట్లేనని టెన్షన్ పడతారు. శ్రీవల్లి, సందీప్, శ్రీలతలు హ్యాపీ గా ఫీల్ అవుతారు.ఇక అంతా దేవుడు దయ అంటూ రామలక్ష్మి సీతాకాంత్ లు మొక్కుకుంటారు. అప్పుడే స్వామి వస్తుంటాడు. అతన్ని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతారు. మీకు ఆక్సిడెంట్ అయిందట అని సీతాకాంత్ అంటాడు. చెప్పాను కదా దుష్టశక్తులు యాగం ఆపాలని చూస్తారని అని స్వామి అంటాడు.ఆ తర్వాత యాగాన్ని మొదలుపెడతారు. ఇది నిష్టతో చెయ్యాలి మధ్యలో నీళ్లు కూడా తాగకూడదని స్వామి చెప్తాడు. ఇప్పుడే ఏదైనా తాగండి అని స్వామి చెప్పగానే నేను తీసుకొని వస్తానంటూ సుజాత వెళ్తుంటే నేను వస్తాను అని శ్రీవల్లి వెళ్తుంది. సుజాత కొబ్బరి నీళ్లు గ్లాస్ లో పోస్తుంది. అందులో శ్రీవల్లి మత్తు టాబ్లెట్ కలుపుతుంది. ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తారు. రామలక్ష్మి ఆ వాటర్ తాగుతుంది.

ఆ తర్వాత యాగం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఆ తర్వాత మాణిక్యం పూజ సామాగ్రి తెస్తుంటే కింద పడిపోతాడు. తాగి వస్తే ఇలాగే ఉంటుందంటూ శ్రీవల్లి గొడవ చేయగా.. తాగి రాలేదని మాణిక్యం అంటాడు. తాగి రాలేదు, తాగి వస్తే ఎలా ఉంటాడు నాకు తెలుసని సీతాకంత్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి మత్తుగా అనిపిస్తుంది. మత్తు పని చేస్తున్నట్లు ఉందని శ్రీవల్లికి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి మత్తులో సీతాకాంత్ పై పడిపోతుంది. ఇదంతా యాగం ఆగడానికి దుష్టశక్తలు చేస్తుంది. మీరు వేదమంత్రాలూ చదవండి ఆపకండి అని స్వామి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.