English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ ప్రియుల‌కు బిగ్ షాక్‌

బుల్లితెర‌పై బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు... ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంత్ హ‌గ్గులు.. హ‌ద్దులు దాటిన‌ ప్రియ - స‌న్నిల‌ మాట‌ల యుద్ధం.. యాంక‌ర్ ర‌వి స‌డ‌న్ ఎలిమినేష‌న్‌.. వెర‌సి బిగ్‌బాస్ వార్త‌ల్లో నిలిచింది. గ‌తంతో పోలిస్తే ఈ సీజ‌న్ పై వ‌చ్చిన‌న్ని విమ‌ర్శ‌లు మ‌రో సీజ‌న్ పై రాలేదు. చివ‌రికి హోస్ట్ నాగార్జున‌పై కూడా నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జ‌రిగింది. ఓ జంట బ్రేక‌ప్ కి కూడా కార‌ణంగా నిలిచి బిగ్‌బాస్ సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా వుంటే 24 గంట‌ల స్ట్రీమింగ్ అంటూ ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్ మొద‌లైన విష‌యం తెలిసిందే.

ఇది తాజాగా వీక్ష‌కుల‌కు బిగ్ షాక్‌ ఇచ్చేసింది. ఫిబ్ర‌వ‌రి 26న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ షో స్ట్రీమింగ్ మొద‌లైంది. ఈ షోపై క్రేజ్ వుండ‌టంతో వీక్ష‌కులు చాలా మంది డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని రీచార్జ్ చేసుకున్నారు. శ‌నివారం మొద‌లైన ఓటీటీ బిగ్ బాస్ షో నాన్ స్టాప్ కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ మాత్రం అంతంత మాత్ర‌మే. ఇంత‌కీ ఈ షో మొద‌లైన‌ట్టుగా కూడా ఎవ‌రికి తెలియ‌లేదు. దీంతో రేటింగ్ దారుణంగా ప‌డిపోయింది.

Also Read:బిగ్‌బాస్ షో రెడ్‌లైట్ ఏరియా క‌న్నా డేంజ‌ర్

ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ ఓటీటీ టీమ్ యూజ‌ర్ల‌కు బిగ్ షాకిచ్చేసింది. ఉన్న‌ట్టుండి లైవ్ స్ట్రీమింగ్ ని ఆపేసింది. 24 గంట‌ల పాటు నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ ప్ర‌చారం చేసిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు బుధ‌వారం అర్థ్రరాత్రి నుంచే లైవ్ స్ట్రీమింగ్ కి బ్రేకివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బుధ‌వారం ఆర్థ్ర రాత్రి స్ట్రిమింగ్ నిలిపివేసిన నిర్వాహ‌కులు గురువారం రాత్రి 9 గంట‌ల నుంచి మ‌ళ్లీ స్ట్రీమింగ్ స్టార్ట‌వుతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఈ షో ఫెయిల్ అయింద‌ని నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.