English | Telugu

Bigg boss 9 Telugu : పట్టు వదలకు టాస్క్ లో డీమాన్ పవన్ గెలుపు.. గట్టి పోటీ ఇచ్చిన భరణి!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం లో కెప్టెన్ రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్ తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారు. ఇక అయిదో వారం చివర్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ల ఎంట్రీ ఉంటుందని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి(మంగళవారం) నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఫ్యామిలీలని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతారు. అలాగే సంజనా తనకిచ్చిన పనిష్మెంట్ అంట్లు తోమడం చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంది. ఇక ఇలా కాసేపు వీరి కబుర్లు చూపించిన బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేశాడు. ఇక అందులో అప్పటికే డేంజర్ జోన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ లు పెట్టి, బార్డర్ లు కూడా కట్టేశాడు బిగ్ బాస్. 'రణరంగం మీ ఊహలకి అందని ప్రదేశం.. ఈ వారం డేంజర్‌లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది.. వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్‌లో ఉన్నవారిని కుదిపేస్తుంది.. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో మీకు తెలుసా.. వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు.. ఈ తుఫాను నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఒకే ఒక్క ఛాన్స్' అంటూ కంటెస్టెంట్స్ కి దడ పుట్టించాడు బిగ్ బాస్.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని ఆపాలంటే మీరు కొన్ని టాస్క్ లు ఆడాలని కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ లని ఈ టాస్క్ లకి సంచాలకులుగా నియమించాడు. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ టీమ్ లుగా ఉన్నారు. మొదటి టాస్క్.. పట్టు వదలకు .. ఇందులో పోటీ పడే వాళ్ళు తమ సీసాని చివరివరకూ ప్లాట్‌ఫామ్‌కి టచ్ కాకుండా చూసుకోవాలి. వారే ఈ టాస్కు విజేతలు అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇందులో మొదటగా సుమన్ శెట్టి ట్రాప్ అవుతాడు. ఆ తర్వాత సంజనా ట్రాప్ అవుతుంది. కాసేపటికి పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతాడు. ఇక చివరగా డీమాన్ పవన్, భరణి ఉంటారు. చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన భరణి నొప్పి భరించలేక డ్రాప్ అవుతాడు.‌ ఇక 'పట్టు వదలకు' టాస్క్ లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలుస్తుంది. ఇక టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. డీమాన్-రీతూ గెలిచారు కాబట్టి వారికి వంద పాయింట్లు వచ్చాయి. ‌ఇక రెండో స్థానంలో లో భరణి-దివ్య, మూడవ స్థానంలో తనూజ-కళ్యాణ్, నాల్గవ స్థానంలో సంజన-ఫ్లోరా, అయిదవ స్థానంలో సుమన్ శెట్టి-శ్రీజ ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.