English | Telugu

bigg boss 9 Telugu : రీతూ చేసిన తప్పుకి సంజన-ఫ్లోరాలకి శిక్ష.. అదే బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 అయిదో వారం కంటెస్టెంట్స్ ఎమోషన్స్ పీక్స్ కి వెళ్తున్నాయి. కథలో మలుపు, ట్విస్ట్ లు అన్నట్టుగా అయిదో వారం ఆట సాగుతుంది. డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్ తమ ఆటతీరు మెరుగుపరుచుకున్బారు. మరోవైపు ఇమ్మాన్యుయల్ ఇరగదీస్తున్నాడు. ఇక రాము రాథోడ్ బెస్ట్ సంఛాలక్ గా చేస్తున్నాడు.

నిన్నటి ఎపిసోడ్ లో.. కంటెస్టెంట్స్ ని టీమ్ లుగా విభజించి కొన్ని టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. భరణి-దివ్య ఒక టీమ్, సంజన-ఫ్లోరా ఒక టీమ్, రీతూ-డీమాన్ పవన్ ఒక టీమ్, తనూజ-కళ్యాణ్, సుమన్-శ్రీజ టీమ్ లుగా ఉన్నారు. ఇక మొదటి టాస్క్ 'పట్టు వదలకు' లో డీమాన్ పవన్-రీతూ టీమ్ గెలిచింది. టాస్క్ లో పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో డీమాన్ పవన్, భరణి చివరి వరకు ఉన్నారు. కానీ చివర్లో భరణి నొప్పి భరించలేక వదిలేశాడు. దాంతో డీమాన్ పవన్ గెలిచాడు. ఇక ఈ టాస్క్ లోని అందరికి వారి పర్ఫామెన్స్ ని బట్టి పాయింట్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక రెండో టాస్క్ లో ఈ టీమ్ లు పాల్గొంటాయి. దానికి సంచాలక్ గా ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ ఉన్నారు.

ఇక సెకెండ్ టాస్క్ లో బెలూన్ ఊది గాలిలో ఉంచాలి.. అయిదు నిమిషాలు అయిందని మీకు అనిపిస్తే వెళ్లి గంట కొట్టండి అని టీమ్ లకి బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. అయితే ఈ రూల్స్ ను రీతూ, డిమాన్ కంప్లీట్ గా మిస్ లీడ్ చేశారు. ఇద్దరు ఫౌల్ ఆడుతారు. వాళ్ళని చూసి తనూజ- కళ్యాణ్ అలాగే ఆడుతారు. అలాగే వాళ్ళని చూసి శ్రీజ-సుమన్ శెట్టి ఆడతారు. భరణి- దివ్య ఇద్దరు బాగానే ఆటినా వారికిచ్చిన మూడు బెలూన్లు పగిలిపోవడంతో కౌంట్ అవ్వలేదు. గేమ్ ఫౌల్ లేకుండా పర్ఫెక్ట్ గా ఆడింది మాత్రం సంజన-ఫ్లోరా మాత్రమే. అయితే ఈ బెలూన్ టాస్క్ పూర్తయ్యాక అందరిపై కోప్పడుతాడు బిగ్ బాస్. ఈ స్కూల్ కి నేనే ప్రిన్సిపల్.. నా ముందే మీ వేషాల అన్నట్లు అందరికి మాస్ వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇక మీకు నచ్చింది చేసుకోండి అని బిగ్ బాస్ అనగానే అందరు సారీ చెప్తారు. తప్పు చేసినందుకు మీకు ఇది వరకు టాస్క్ లో వచ్చిన పాయింట్లలో నుండి సగం తీసేస్తున్నాను.. ఒక్క సంజన-ఫ్లోరా టీమ్ కి మాత్రం పాయింట్స్ అలాగే ఉంటాయని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో సంజన ఫ్లోరా టీమ్ పాయింట్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉంటారు.

ఈ టాస్క్ లో గెలుపు దగ్గరిదాకా వచ్చి ఓడిపోయినందుకు సంజన ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే వారు గేమ్ గెలిచారు‌.‌ కానీ రీతూ చేసిన ఫౌల్ వల్ల అందరికి శిక్ష వేశాడు బిగ్ బాస్. ఒక్కరి వల్ల అందరికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్. గెలుపు వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంది. ఇక అప్పుడే ఇమ్మాన్యుయల్, రాము రాథోడ్ వచ్చి సంజనని ఓదారుస్తారు. ప్రతీసారి ఓడిపోతూ ఉండటం నచ్చట్లేదు.‌ ఓడిపోయిన చోట ఎవరుంటారు చెప్పు అంటూ ఇమ్మాన్యుయల్, రాములతో సంజన చెప్పుకుంటూ ఏడుస్తుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.