English | Telugu

Bigg Boss 9 Telugu : డీమాన్ మాట వినకుండా ఓడిపోయిన శ్రీజ.. లీడ్ లో భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఒక్కో రోజు ఒక్కోలా కంటెస్టెంట్స్ ఆటతీరు సాగుతోంది. ఇక భరణి, శ్రీజల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. హౌస్ పర్మినెంట్ హౌస్ మేట్ ఎవరవుతారని ఇద్దరి మధ్య టాస్క్ ల మీద టాస్క్ లు జరుగుతున్నాయి. మొన్నటి టాస్క్ లో శ్రీజ విన్ అయింది. అందులో సంచాలక్ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు.. తర్వాత మాధురికి సంఛాలక్ ఇవ్వగా శ్రీజ టీమ్ విన్ అయింది. దాంతో ఆ టాస్క్ ని నిన్న బిగ్ బాస్ రద్దు చేసాడు. నిన్న హౌస్ లో మొత్తం మూడు టాస్క్ లు జరుగగా.. మొదటి టాస్క్ మెయిజ్ టాస్క్. అందులో భరణి చెయ్ కి గాయం ఉండడంతో తన తరుపున దివ్య ఆడింది. ఫస్ట్ టాస్క్ లో దివ్య, శ్రీజ పోటీ పడగా అందులో దివ్య గెలుస్తుంది.

దాంతో శ్రీజ డిస్సపాయింట్ అవుతుంది. అసలు లక్ కలిసి రావడం లేదు.. గెలిచిన ఒక్క టాస్క్ కూడా రద్దు అయిందని శ్రీజ బాధపడుతుంది. రెండో టాస్క్ లో భరణి, రాము ఒక జట్టు.. శ్రీజ, కళ్యాణ్ ఒక జట్టుగా ఉన్నారు. అందులో భరణి టీమ్ టాస్క్ ని ఎనిమిది నిమిషాల్లో పూర్తిచేస్తే శ్రీజ టీమ్ రెండు నిమిషాల్లో పూర్తిచేసింది. ఇందులో కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా ఆడటంతో శ్రీజ టీమ్ విన్ అయింది. మూడో టాస్క్ లో భరణి టీమ్ నుండి ఇమ్మాన్యుయల్ ని తోసుకోగా.. శ్రీజ టీమ్ నుండి ఎవరిని తీసుకువాలో శ్రీజ కన్ఫ్యూషన్ లో పడింది. అయితే నేను ఆడుతానని డీమాన్ అంటాడు. నీకు ఎవరిపై నమ్మకం ఉంటే వాళ్ళని ఆడించమని డీమాన్ అంటాడు. దాంతో కళ్యాణ్ ని శ్రీజ సెలక్ట్ చేసుకుంటుంది. ఆ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ విన్ అవుతాడు.

మూడు టాస్క్ లలో భరణి రెండు విన్ అయి కోటపై తన రెండు జండాలని ఎగురవేస్తాడు. శ్రీజ ఒక్క గేమ్ విన్ అవుతుంది ఒక్క జెండా ఎగురవేస్తుంది. ఇక టాస్క్ లలో భరణి టీమ్ తనూజకి ఛాన్స్ ఇవ్వలేదని తను మాధురికి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. నన్ను ఆడనివ్వలేదంటే నాపై నమ్మకం లేదన్నట్లే కదా అని తనూజ చెప్తుంది‌. మాధురి ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.