English | Telugu

Duvvada Madhuri vs Tanuja : కడుపు మాడ్చుకున్న దువ్వాడ మాధురి.. భరణి కోసమేనా!

బిగ్ బాస్ సీజన్-9 లో దువ్వాడ మాధురి హౌస్ లోకి వెళ్ళిన నుండి కంటెంట్ ఇవ్వడానికి ఫుల్ ట్రై చేస్తోంది. ఎక్కడ స్కోప్ దొరికితే అక్కడ గొడవేసుకొని, జనాల మీద అరిచేసి కంటెంట్ ఇస్తుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మార్నింగ్ సాంగ్ కి అందరు డ్యాన్స్ చేసి ఎక్కడివాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. ఇక సంజన, మాధురి ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు.

రాత్రి తనూజతో జరిగిన గొడవ గురించి సంజనతో మాధురి చెప్పింది. నాకు నిన్న వచ్చిన కోపానికి బీపీ పైవరకు వెళ్లిపోయింది‌‌.. ఎందుకులే గొడవ అని పడుకుండిపోయానని మాధురి అంది. ఇంతలో మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారంటూ తనూజ వచ్చి అడిగింది. అది మీరే చెప్పాలంటూ మాధురి అంది. కూరగాయలు ఉండేదాన్ని బట్టి వండేది నువ్వు కదా అని తనూజ అంటుంది‌‌. నువ్వేం చెప్తే అది వండాలని చెప్పావ్ కదా అని మాధురి అంటుంది‌. ఇన్ని రోజులు నేను ఏం చెప్తే అది వండావా అని తనూజ అడిగింది. నిన్న కూడా నువ్వు చెప్పావ్ కదా రైస్ ఇంత వండాలని, ఇలా చపాతీ కావాలనంటూ మాధురి చెప్పింది. సరే మార్నింగ్ రైస్ ఏం వండుతావని అడుగుతున్నానని తనూజ అంటే అందుకే అడుగుతున్నా నువ్వేం రైస్ చేయమంటే అది చేస్తా.. నాకు తెలియట్లేదు తనూజ..నిన్న నాకు ఆకలేసింది.. ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగాను దానికే నువ్వు అరిచావ్. అందుకే నీతో డిస్కస్ చేయాలని లేదంటూ మాధురి ఆకలి మంటని బయటపెట్టింది.

ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్లు చూస్తే హర్ట్ అవుతారు.. మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతీ ఎక్స్‌ట్రా అడిగానంటూ మాధురి ఎమోషనల్ అయింది. దీంతో ఏం తెలీనట్లు దివ్యని పిలిచి ఆవిడ ఎక్స్‌ట్రా చపాతీ అడిగితే ఇవ్వలేదా అంటూ తనూజ అడిగింది. అదేంటి ఇచ్చా కదా అని దివ్య అంటే.. అది కాదు ఇంకొకటి అడిగా.. లేవు అంటే పిండి చేసుకుంటానని కూడా అన్నా.. తనూజయే కదా వద్దున్నావంటూ మాధిరి సూటిగా అడిగింది. ఆకలేస్తేనే కదా అడుగుతాను.. నేను ఈ పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా అడిగానా అని మాధురి చెప్పింది. ఇక తనూజ ఆన్సర్ ఇవ్వకుండా కుకింగ్ టీమ్ ప్లస్ కెప్టెన్‌ని పిలిచి మీటింగ్ పెట్టింది.

భరణి హౌస్ లోకి వెళ్ళిన నుండి మాధురి తనకి కేరింగ్ చూపిస్తుంది. నిన్న భరణికి ప్రేమగా ప్లేట్ లో అన్నం పెట్టి ఇచ్చింది. తనకి సంభందించిన ప్రతీ విషయంలో మాధురి ఇంట్రెస్ట్ చూపిస్తుందంటూ సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి‌. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే భరణి, మాధురి కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు రీల్స్ కూడా చేస్తున్నారు. మరి మాధురిని భరణి ఏం అయినా అన్నాడా లేక తనూజపై ఉన్న కోపంతో మాధురి కడపు మాడ్చుకుందా తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.