English | Telugu

Bigg boss 9 Telugu : దివ్య, తనూజ మధ్య నలిగిపోతున్న భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తన ఉంది. హౌస్ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంది.. హౌస్ లోని అందరికి పెద్ద దిక్కుగా మన భరణి ఉంటున్నాడు.. కొందరికి నాన్న, కొందరికి మావయ్య, మరికొందరికి బాబాయ్, ఇంకా కొందరికి అన్నయ్య.. ప్రతీది తనకే చెందుతుంది.. గత వీకెండ్ లో నాగార్జున అన్నట్లే రేలంగి మావయ్య అనే టైటిల్ భరణికి ఆప్ట్ అవుతుంది.

పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య.. మధ్యలో నాన్న(భరణి) నలిగిపోతున్నాడు. దివ్య, భరణి ఒక టీమ్ కాబట్టి కలిసి కట్టుగా ఆడుతున్నారు. వాళ్ళు క్లోజ్ అయ్యారని తనూజ మొహం మాడ్చింది. తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నావని భరణి మొహం పైనే చెప్పేసింది తనూజ. తాజాగా జరిగిన టాస్క్ లో కళ్యాణ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి తనూజ ఒకే చెప్తుంది.. నువ్వు అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావని తనూజని దివ్య అడుగుతుంది. ఆ కన్వర్ సేషన్ అయ్యో వరకు బాగా మాట్లాడుకున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భరణి, ఇమ్మాన్యుయల్, రాము, కళ్యాణ్, తనూజ, దివ్య ఉన్నారు. అదేంటంటే మాస్క్ పెట్టుకొని మిగతా వాళ్ళ లైట్ ని ఎవరు ఆన్ చేసారో కనిపెట్టాలి. ఆ టాస్క్ లో దివ్య లైట్ ని తనూజ అఫ్ చేస్తుంది. నాకు తెలిసి తనూజ చెయ్యదు.. కళ్యాణ్ చేసి ఉంటాడని కళ్యాణ్ పేరు చెప్తుంది. అది రాంగ్ ఆన్సర్ కాబట్టి దివ్య టాస్క్ నుండి ఎలిమినేట్ అవుతుంది.

దాంతో దివ్య ఎమోషనల్ అవుతుంది. అసలు నేను తనూజని నమ్మానని బాధపడుతుంది. అంతా అయ్యాక సారీ చెప్పడానికి దివ్య దగ్గరికి తనూజ వస్తుంది. నేను వినను ఇక ఎవరిని నమ్మనని దివ్య అంటుంది. ఈ రోజు తనూజ చేసింది. ఇక కాసేపటికి పడుకునే ముందు.. సుమన్ శెట్టి, భరణి, దివ్య సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటారు. మీకెలా అనిపిస్తుందని భరణిని దివ్య అడుగుతుంది. తప్పు అని భరణి అంటాడు. తనని మీ వల్ల నమ్మానని దివ్య తన బాధని భరణికి చెప్తుంది. భరణి మాత్రం సైలెంట్ గా ఉంటాడు. చిన్నకూతురు, పెద్దకూతురు మధ్య ఏం అనలేకపోతున్నాడు భరణి. మరి వీరి బాండింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.