English | Telugu

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఇంటి నుండి నయని అవుట్.. క్రైయింగ్ బేబీకి టాటా!

బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక హౌస్ లోని అందరి ఆటతీరే మారిపోయింది. ఓ రేస్ లో పాల్గొంటున్నట్టుగా రెండు క్లాన్ లు తమ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో మెహబూబ్ గతవారమే ఎలిమినేషన్ అయ్యాడు. ఇక అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ టాస్క్ లోను సూపర్ గా రాణిస్తున్నారు.

అయితే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని పెద్దగా ఏం ఆడట్లేదు. హౌస్ లో ఇంతవరకు ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు. ఎప్పుడు చూసినా ఏడుపే.. ప్రతీదానికీ ఏడుపే.మ ఎవరేం అన్నా ఏడుపే.. అందుకే అందరు తనకి క్రైయింగ్ బేబీ అని అంటారు. ఇకనుండి ఆ క్రైయింగ్ కి టాటా చెప్పే సమయం వచ్చేసింది. మొన్నటి వరకు జరిగిన ఓటింగ్ పోల్స్ లో టేస్టీ తేజ, హరితేజ, నయని పావని డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక వీరిలో నుండి నయని పావని ఎలిమినేషన్ అయిందంటు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గత సీజన్లో వారానికే ఎలిమినేట్ అయిందే పాపం.. ఈ పాప కాస్త యాక్టివ్‌గానే ఉంది.. జనాలే కాస్త తొందరపడి ఈమెను ఎలిమినేట్ చేసి ఉంటారు.. ఇంకొన్ని రోజులు ఉంటే ఆమె నిరూపించుకునేదేమో పాపం అని అప్పుడు జనం అనుకున్నారు. కానీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని మూడు, నాలుగు వారాలు ఉండటంతోనే ఆమె మీద నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. ఉన్న కాస్త పాజిటివ్ ఇమేజ్ కూాడా పోయింది. జనాల మనసు గెలవాలంటూ శివాజీ దగ్గర్నుంచి వీడియో సందేశాన్ని అందుకున్నా దానిని ఫాలో అవ్వలేదు. చివరకు మాకు వద్దురా బాబు అనేంతలా తన ఆటతీరు, మాటతీరు ఉంది. ఇక ఈ వారం నయని పావని ఎలిమినేషన్ అయినట్టు తెలుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.