English | Telugu

మా బుజ్జి బంగారం డిమోన్‌ అంటూ పవన్ కి ముద్దు పెట్టేసిన రీతూ!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. బిబి 9 స్పెషల్ గా రాబోతోంది. ఈ షోకి సంజన, రీతూ, శ్రీజ, కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, ఇమ్మానుయేల్ వచ్చారు. "బిగ్ బాస్ ఫాన్స్ రెడీ ఐపోండి. మూడు నెలల్లో మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ ని మా పరివారంలో రెండు గంటల్లో ఇవ్వబోతున్నాం" అంటూ శ్రీముఖి చెప్పింది.

"ఫస్ట్ ఏ కామనర్ ఐనా శ్రమ పడాల, కష్టపడాల అప్పుడే అవుతారు కళ్యాణ్ పడాల" అంటూ బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ కి మంచి ఎలివేషన్ ఇచ్చాడు హరి. వెంటనే శ్రీజ "బాబులకు బాబు కళ్యాణ్ బాబు" అంటూ అరిచింది. ఇక ఇమ్మానుయేల్ ఐతే "బయట శ్రీజ చేసే హడావిడికి గెలిచింది శ్రీజానా కల్యాణ అన్న విషయాన్ని మర్చిపోయారంతా" అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇమ్మానుయేల్ ని షోలో చూసేసరికి హగ్ చేసుకుంది శ్రీముఖి. "మా కమెడియన్స్ కి ఎందుకు కప్ ఇవ్వలేదు" అంటూ అవినాష్ కూడా ఒక డైలాగ్ వేసాడు.

"పవన్ ఒక కామనర్ గా అడుగు పెట్టావు తర్వాత టాప్ 3 కి వెళ్లి సూటుకేసు తెచ్చావు ఎలా అనిపిస్తోంది" అని శ్రీముఖి అడిగేసరికి అవినాష్ పవన్ లా గొంతు మార్చి "చాల హ్యాపీ అనిపిస్తోంది" అన్నాడు. "బిగ్ బాస్ హౌస్ లో నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఐతే రీతూ" అంటూ డిమోన్‌ పవన్ చెప్పుకొచ్చాడు. దాంతో రీతూ తెగ సిగ్గు పడిపోయింది. "ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ జెన్యూన్ మా బుజ్జి బంగారం డిమోన్‌" అంటూ స్టేజి మీద పవన్ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ఇక పవన్ ఐతే కళ్ళెగరేస్తూ అదో ఘనకారంలా ఫుల్ హ్యాపీ అయ్యాడు. ఇక ఇమ్మానుయేల్ అటు పవన్ , ఇటు కళ్యాణ్ మీద చేతులేసి చిరంజీవిలా "ఏవండీ మా తమ్ముళ్లు జెమ్స్ అండి జెమ్స్ " అంటూ ఫైనల్ డైలాగ్ చెప్పాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.