English | Telugu
15 ఇయర్స్ అయ్యిందా పెళ్ళై.. డాక్టర్ బాబుని ఆడుకున్న రవితేజ!
Updated : Dec 31, 2025
కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సంక్రాంతి కూడా వచ్చేసినట్టే. సంక్రాంతి వస్తుందంటే చాలు బుల్లితెర మొత్తం కొత్త కొత్త షోస్, ఈవెంట్స్ తో కళకళలాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో "సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" టైటిల్ తో ఒక ఎపిసోడ్ రాబోతోంది. యాంకర్ సుమ ఈ షోని నిర్వహించబోతున్నారు. "ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలా ఉండబోతోంది. పందెం కోళ్ల లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులతో ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" అంటూ చెప్పారు.
ఇందులో ఆది ఫైర్ స్టార్మ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ మూవీ జానీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆయన లేటెస్ట్ మూవీ ఓజిలోని వాషి యో వాషి అంటూ డైలాగ్ చెప్పేసరికి నాగబాబు కూడా పగలబడి నవ్వేశారు.
తర్వాత మాస్ మహారాజ రవితేజ వచ్చారు. "భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే బాగుంటుంది" అంటూ కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల రవితేజను అడిగాడు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై నీకు" అని రవితేజ అడిగారు. 15 ఇయర్స్ అని చెప్పాడు నిరుపమ్. " 15 ఇయర్స్ అయ్యిందా. ఇంకా గిఫ్ట్ ల గురించి మాట్లాడుతున్నాడేమిటి ?" అంటూ రివర్స్ లో అడిగేసరికి అక్కడే ఉన్న అనిల్ రావిపూడి "అంతేగా అంతేగా" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.