English | Telugu

సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సుమ సాయం..

యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ తో నిండిపోతుంది. ఏ కార్యక్రమానికైనా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. అది మూవీ రిలీజ్ ఫంక్షన్ ఐనా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఐనా, యాడ్స్ లో కామెడీ చేయాలన్నా ఏదైనా సుమ నిత్యం కనిపిస్తూ అలరిస్తూనే ఉంటుంది. అలాంటి సుమ ఒక్క యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది సుమ. ఈ ఫౌండేషన్ ద్వారా 30కి పైగా విద్యార్థులకు, సెక్స్ ట్రాఫికింగ్ సర్వైవర్‌లకు సహాయం అందించినట్లు తెలుస్తోంది.

అలాగే 200 పైగా కంటి చికిత్సలు, 2 వేలకు పైగా కంటి పరీక్షలు కూడా చేయించిందట. అంతేకాకుండా ఎన్నో అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్ బతుకుదెరువు కోసం కొన్ని షాప్స్ కూడా ఏర్పాటు చేయించింది సుమ. అలాగే 100 మంది సీనియర్ సిటిజన్స్ ఉండేలా నెక్స్ట్ ఓల్డేజ్ హోమ్ ని సుమ ఏర్పాటు చేసింది. ప్రతీ పండగకు ఎదో ఒక స్పెషల్ ఈవెంట్ చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణం చాలా మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సుమ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.