English | Telugu

రాజా ఎప్పుడైనా నన్ను అలా పిలిచావా?

క్యాష్ ప్రోగ్రాంతో సుమకి ఒక క్రేజ్ అనేది వచ్చేసింది ఆడియెన్స్ లో. క్యాష్ ప్రోగ్రాంకి సుమ తప్ప వేరేవారిని అస్సలు ఊహించుకోలేరు. సుమకి, ఆమె భ‌ర్త‌ రాజీవ్ కనకాలకు ఉన్న‌ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు. బుల్లితెర మీద అందరి జంటల్లాగే వీళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ లో. గతంలో ఈ ఇద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని బ్రేక్ చేస్తూ సుమ ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఐనా సోషల్ మీడియాకి గొంతు పెద్దది.. ఎప్పుడూ ఎదో ఒకటి అంటూనే ఉంటుంది. సుమ, రాజీవ్ అస్సలు కలిసి ఏ షోలో కూడా కనిపించరు, ఇద్దరి మధ్య పొసగట్లేదని కూడా తర్వాత వార్తలు వస్తూనే ఉన్నాయి.

సుమ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోవడం మానేసింది. ఐతే క్యాష్ ప్రోగ్రాం రాబోయే ఎపిసోడ్ కి సీతారామం టీం ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్, తరుణ్ భాస్కర్, సుమంత్, హను రాఘవపూడి గెస్టులుగా వచ్చారు. సుమ దుల్కర్ తో కలిసి స్టెప్పులేసింది. దుల్కర్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని ఈ ప్రోమో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆడియన్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ దుల్కర్ పై కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. కళ్యాణి అనే ఒక అమ్మాయి "మీ భార్య మిమ్మల్ని ఏమని పిలుస్తారు" అని దుల్కర్ ని అడిగింది. "జాన్" అని పిలుస్తుందని చెప్పారు దుల్కర్. తర్వాత సుమ "మీరు మీ వైఫ్ ని ఏమని పిలుస్తారు?" అని అడిగింది. 'సీజియో' అని ఒక వెరైటీగా నిక్ నేమ్ చెప్పాడు దుల్క‌ర్‌.

అమల్ సూఫియా, జాన్ కాబట్టి రెండు పేర్లు కలిపి ముద్దుగా పిలుస్తాడనే విషయం అర్థ‌మవుతోంది. వెంటనే సుమ అందుకుని "రాజా చూసావా, ఎప్పుడైనా అలా పిలిచావా నన్ను?" అని అడిగింది. ఆ ప్రశ్నకు స్టేజి మీద అందరూ నవ్వేశారు. తర్వాత ఒక అమ్మాయి దుల్కర్ కోసం ఒక సాంగ్ పాడింది. తర్వాత లేడీ ఫాన్స్ అంతా గులాబీలు ఇచ్చి అతనితో కలిసి డాన్స్ చేశారు.