English | Telugu
పొట్టి గౌను వేసుకున్న పెద్ద పాప
Updated : Jul 30, 2022
హరితేజ బుల్లితెర మీద యంగ్ అండ్ డైనమిక్ యాంకర్. వెరీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ తల్లైన హరితేజ బాడీలో చాలా చేంజెస్ వచ్చి ఎంతో మారిపోయింది. పెరిగిన వెయిట్ ని ఎక్సర్సైజ్లు చేస్తూ వర్కౌట్స్ చేస్తూ మళ్ళీ పాత హరితేజలా మారడానికి ట్రై చేస్తోంది. ఎప్పుడూ పద్దతిగా కనిపించే హరితేజ ఈమధ్య కొన్ని ఫోటో షూట్స్ లో కురచ బట్టల్లో కనిపిస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురౌతోంది. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకుందో ఏమో తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తోంది. ఇక ఇప్పుడు కూడా లేటెస్ట్ గా మాల్దీవ్స్ వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసేసింది. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన హరితేజ అక్కడ నానా రచ్చ చేసింది.
ఫారెన్ లో ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి చిట్టి, పొట్టి డ్రెస్ వేసేసుకుని థైస్ కనిపించేలా వీధుల్లో చిందులేసేసింది. ఆ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసేసరికి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఐతే నెటిజన్స్ మాత్రం ఇలాంటి డ్రెస్సులు ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హరితేజ కూచిపూడి డాన్సర్ కెరీర్ ని ప్రారంభించింది. తర్వాత బుల్లి తెర మీదకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో "మనసు మమత" సీరియల్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత "ముత్యమంతా పసుపు, "రక్త సంబంధం", "అభిషేకం", "తాళికట్టు శుభవేళ" , "శివరంజని", "కన్యాదానం" వంటి సీరియల్స్ చేసింది. ఈ సీరియల్స్ ద్వారా హరితేజ బాగా పాపులర్ అయ్యింది.