English | Telugu

'కార్తీక‌దీపం'లో శౌర్య‌గా వ‌స్తోంది ఎవ‌రు?


బుల్లితెర సీరియ‌ల్స్ ల‌లో `కార్తీక దీపం` ఓ ప్ర‌త్యేక‌త‌ని సాధించింది. దేశ వ్యాప్తంగా టాప్ సీరియ‌ల్ గా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుని టాప్ సీరియ‌ల్ గా పాపుల‌ర్ అయింది. ఇందులో న‌టించిన వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్‌, డాక్ట‌ర్ బాబు ప‌రిటాల నిరుప‌మ్‌, బేబీ స‌హృద‌, బేబీ కృతిక‌లు సెల‌బ్రిటీలుగా మారిపోయారు. మ‌ల‌యాళ పాపుల‌ర్ సీరియ‌ల్ `క‌రుత ముత్తు` ఆధారంగా ఈ సీరియ‌ల్ ని తెలుగులో రీమేక్ చేశారు. అక్క‌డ వంట‌ల‌క్క‌గా న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ తెలుగులోనూ అదే పాత్ర‌ని పోషించి స్టార్ గా మారిపోయింది.

ఇదిలా వుంటే గ‌త రెండు రోజులుగా `కార్తీక దీపం` లేటెస్ట్ ప్రోమో వైర‌ల్ గా మారింది. అందులో హిమ, శౌర్య‌ పెద్దవాళ్లైపోయారు. హిమ డాక్ట‌ర్ అయితే.. శౌర్య ఆటో డ్రైవ‌ర్ గా ఇంటికి దూరంగా పెరిగిన‌ట్టుగా చూపించారు. హిమ పాత్ర‌లో `మ‌న‌సిచ్చిచూడు` ఫేమ్ కీర్తి భ‌ట్ న‌టిస్తోంది. ఇక ఆటో డ్రైవ‌ర్ శౌర్య‌గా న‌టిస్తున్న న‌టి ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. శౌర్య‌గా న‌టిస్తున్న యువ‌తి క‌న్న‌డ న‌టి. త‌న పేరు అమూల్య గౌడ‌. క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌ లో 1993 జ‌న‌వ‌రి 8న పుట్టింది. క‌న్న‌డ‌లో `క‌మ‌లి` అనే సీరియ‌ల్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

2014లో వ‌చ్చిన క‌న్న‌డ సీరియ‌ల్ `స్వాతిముత్తు`తో న‌టిగా కెరీర్ ప్రారంభించింది. అయితే ఆమెకు గుర్తింపుని తెచ్చిపెట్టింతి మాత్రం `క‌మ‌లి` సీరియ‌ల్‌. 'పున‌ర్ వివాహ‌`, 'ఆరామ‌నే' వంటి సీరియ‌ల్స్ లోనూ న‌టించి పాపులర్ అయింది. `క‌మ‌లి` సీరియ‌ల్ తో క‌న్న‌డ‌లో పాపులారిటీని క్రేజ్ ని సొంతం చేసుకున్న అమూల్య గౌడ తొలి సారి తెలుగులో న‌టిస్తున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప్రోమోలో అద‌ర‌గొడుతున్న ఈ క‌న్న‌డ చిన్న‌ది తెలుగు నాట ఏ స్థాయిలో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.