English | Telugu

సన్నీలియోన్ కి షాక్.. ఈ సిటీలో న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు 

Publish Date:Dec 31, 2025

          -ఎవరు ఊహించలేదు -ఎందుకు వేడుకలు రద్దు  -సన్నీలియోన్ ఏం చెప్తుంది!     జిస్మ్ 2 తో భారతీయ సినీ ప్రేక్షకులని తన మానియాతో మెస్మరైజ్ చేసిన నటీ 'సన్నీలియోన్'(Sunny Leone). తన పోస్టర్ పడితే చాలు థియేటర్స్ కి ప్రేక్షకులు పరుగులు పెట్టేలా అంత స్టేటస్ కూడా సన్నీలియోన్ సొంతం. దక్షిణాదిలో కూడా ల్యాండ్ అయ్యి మన తెలుగులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన 'కరెంటు తీగ'లో చేసింది. సినిమాలకి సంబంధం లేకుండా సన్నీ లియోన్ పలు ప్రైవేట్ ఫంక్షన్స్ కి హాజరై అభిమానులని, ఆహుతులని అలరిస్తూ వస్తుంది. నూతన సంవత్సర వేడుకలకి కూడా గెస్ట్ గా  వెళ్లి అభిమానుల్లో ఉన్న న్యూ ఇయర్ జోష్ ని రెట్టింపు చేసిన సందర్భాలు ఉన్నాయి.      ఈ కోవలోనే న్యూ ఇయర్ సందర్భంగా  రేపు ఉత్తర ప్రదేశ్ లోని  మధుర(Mathura)లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హోటల్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో సన్నీలియోన్‌తో డీజే నైట్ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 300 మందికి మాత్రమేప్రవేశం ఉండేలా టికెట్లు  ముందుగానే విక్రయించారు. ఈ ఈవెంట్ పై సన్నీలియాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మీ మధుర వచ్చి డి జె గా న్యూ ఇయర్ జోష్ ని మరింతగా పెంచబోతున్నామని వీడియో కూడా చేసింది. కానీ  ఈ  ఈవెంట్‌పై స్థానిక సాధువులు, పూజారులు, హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మధుర, బృందావన్, బ్రజ్ ప్రాంతం మొత్తం శ్రీకృష్ణుడి లీలలకు సాక్ష్యమైన పవిత్ర భూమి. భజనలు, కీర్తనలు, ధార్మిక కార్యక్రమాలు జరగాల్సిన ప్రాంతంలో నైట్ పార్టీలు, డీజే ఈవెంట్లు నిర్వహించడం బ్రజ్ ప్రాంత సంప్రదాయాలకి  విరుద్ధమని తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. జిల్లా అధికార  యంత్రాంగానికి లేఖలు కూడా రాసి తమ ఆందోళనని ఉధృతం చేసింది.        Also Read:  ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి      ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకుడు మితుల్ పాఠక్ స్పందిస్తు'సన్నీలియోన్‌ని  ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే ఇన్ వైట్ చేసాం.ఇది కేవలం డీజే పెర్ఫార్మెన్స్ మాత్రమే. అన్ని చట్టపరమైన అనుమతులు, పరిపాలనా నిబంధనలు పాటించాం. అయినప్పటికీ, సామాజిక మరియు ధార్మిక మనోభావాలను గౌరవిస్తు ఈవెంట్‌ ని రద్దు చేస్తున్నాం. ఈ రద్దుతో ఆర్ధికంగా కొంత నష్టం వస్తుందని తెలిపాడు.    

Pelli Choopulu producer Yash Ragineni rings Champion debut as actor

Publish Date:Dec 31, 2025

Yash Rangineni has long been known to Telugu audiences as a producer with sharp judgment and refined cinematic taste. Under his Big Ben Cinemas banner, he has backed several meaningful and distinctive films. His production debut, Pelli Choopulu, starring his nephew Vijay Deverakonda, went on to become a critically acclaimed commercial blockbuster, earning National Award and securing its place as a modern classic in Telugu cinema. Following that success, Yash Rangineni produced notable films such as Dorasani, Dear Comrade, ABCD, Annapurna Photo Studio, and Bhaag Saale—each reflecting his inclination towards content-driven storytelling and socially resonant themes. Through these films, he firmly established himself as a producer with vision and conviction. Now, Yash Rangineni is proving his mettle on screen as well. His latest outing, Champion, directed by National Award-winning filmmaker Pradeep Advaitham, marks a significant and worthy step in his acting journey. Set against a compelling period backdrop and headlined by Roshan Meka, the film features Yash Rangineni in a brilliantly written role that allows him to explore layered emotions and moral strength.   In Champion, he essays the role of Veeraiah—an uneducated, idealistic man rooted in rural life, representing the marginalized and oppressed sections of society. Yash Rangineni delivers a powerful and nuanced performance, embracing the character with raw sincerity and restraint. Rather than relying on dialogue-heavy dramatics, he communicates volumes through his silence, body language, and commanding screen presence. His portrayal of Veeraiah—a man who speaks little, observes deeply, and carries an intense inner fire—is being widely noticed and appreciated. Through subtle expressions, measured movements, and quiet strength, Yash Rangineni brings authenticity and emotional depth to the character, making him a symbol of hope and resistance within the narrative. With Champion currently running successfully in theatres, Yash Rangineni’s transition from producer to actor stands out as both natural and impactful—reinforcing his versatility and deep understanding of cinema, not just behind the scenes but firmly in front of the camera as well. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

ఎవరితోనూ పోల్చలేని విశిష్ట నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య!

Publish Date:Dec 31, 2025

(డిసెంబర్‌ 31 కొంగర జగ్గయ్య జయంతి సందర్భంగా..) కళావాచస్పతి జగ్గయ్య.. ఈ పేరుకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తన కంచుకంఠంతో చెప్పే డైలాగులు, ఆయన అభినయం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆయన పోషించిన పాత్రలు వారి మనసుల్లో ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. పాత్ర ఏదైనా, దాని స్వభావం ఎలా ఉన్నా.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోసే అసమాన నటుడు జగ్గయ్య. ఆయన నటుడే కాదు, రచయిత, చిత్రకారుడు, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న జగ్గయ్యను 1992లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.    1926 డిసెంబర్‌ 31న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోరంపూడి అనే గ్రామంలో సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు కొంగర జగ్గయ్య. 11 సంవత్సరాల వయసులోనే సీత అనే నాటకంలో లవుడి పాత్రను పోషించారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరి భారత స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఆరోజుల్లోనే తెనాలిలోని కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ గ్రూపుకు సెక్రటరీగా పనిచేసారు. వివిధ ప్రాంతాల్లో జరిగే సదస్సులకు హాజరై పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లో స్టైల్‌ తీయించి ఆంధ్రప్రదేశ్‌లో పంచిపెట్టేవారు. ఇంటర్మీడియట్‌ తర్వాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్‌ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పనిచేశారు.   గుంటూరులోని ఎసి కాలేజీలో చదువుతున్న సమయంలో ఎన్‌.టి.రామారావుతో జగ్గయ్యకు పరిచయం ఏర్పడిరది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించేవారు.  జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. డిగ్రీ పూర్తవగానే దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవారు. ఆ తర్వాత ఢల్లీిలో ఆల్‌ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు.    నాటకాలు వేసే ప్రతి నటుడూ సినిమా రంగానికి వెళ్లాలని ఆశ పడుతుంటారు. అలా జగ్గయ్య కూడా 1952లో త్రిపురనేని గోపీచంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రియురాలు’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో చేసిన కొన్ని సినిమాలు కూడా ఆడలేదు. సినిమాల కోసం ఆలిండియా రేడియోలో సంవత్సరం పాటు సెలవు పెట్టారు జగ్గయ్య. సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1954లో వచ్చిన బంగారుపాప చిత్రం విజయం సాధించింది. అందులో పాతికేళ్ళ వయసులోనే వృద్ధుడిగా జగ్గయ్య పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది.    ఆ తర్వాత అర్థాంగి చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ఈ రెండు సినిమాలు జగ్గయ్య ఒక వైవిధ్యమైన నటుడిగా స్థిరపడేలా చేశాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, విలన్‌గా.. ఇలా అన్ని తరహా పాత్రలు పోషించి ఏ నటుడితోనూ పోల్చలేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు జగ్గయ్య. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రంలో చేసిన రూథర్‌ఫర్డ్‌ పాత్ర ఆయన నట జీవితంలో ఒక మైల్‌స్టోన్‌ అని చెప్పొచ్చు. రూథర్‌ఫర్డ్‌ 1940 ప్రాంతంలో కృష్ణాజిల్లా, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆయన గురించి ఎంతో మంది అధికారులకు తెలుసు. రూథర్‌ ఫర్డ్‌ ప్రవర్తన గురించి, మనస్తత్వం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు జగ్గయ్య. అతను చాలా మంచి వ్యక్తి అని, సీతారామరాజు అంటే అతనికి ఎంతో గౌరవం ఉండేదని తెలిసింది. అయితే బ్రిటిష్‌ ప్రభుత్వానికి విధేయుడు కాబట్టి సీతారామరాజును పట్టుకుని తీరాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత రూథర్‌ఫర్డ్‌ పాత్రను రొటీన్‌గా వుండే విలన్‌లా కాకుండా నిర్వహణకు బద్దుడుగా ఉండే హుందా కలిగిన వ్యక్తిలా మార్చి రాయమని రచయిత మహారథిని కోరారు జగ్గయ్య. అలా రూథర్‌ఫర్డ్‌ క్యారెక్టరైజేషన్‌ను మార్చిన తర్వాత ఆ క్యారెక్టర్‌కు మంచి ఎలివేషన్‌ వచ్చింది. దాన్ని ఎంతో అద్భుతంగా పోషించిన జగ్గయ్యకు ప్రశంసలు లభించాయి. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అల్లూరి సీతారామరాజు సినిమా చూసి జగ్గయ్యకు ఫోన్‌ చేసి ‘మీ పాత్ర పోషణ అద్భుతం’ అన్నారట.    1952 నుంచి 1970 నటుడిగా ఎంతో బిజీగా ఉండేవారు జగ్గయ్య. రొటీన్‌ క్యారెక్టర్లు చెయ్యడానికి జగ్గయ్య విరుద్ధం. అందుకే ఒక పాత్ర కోసం తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను అందులోని క్లిష్టమైన పాత్ర ఇవ్వమని కోరేవారు. విలన్‌ అంటే భయంకరంగా ఉండాల్సిన అవసరం లేదు. అందంగా ఉంటూ మనమధ్యన తిరిగే మామూలు మనిషిలాగే ఉంటాడు. అలా ఉంటేనే ఎదుటివారిని తేలికగా మోసం చేయగలడని నిరూపించడానికి అలాంటి విలన్‌ క్యారెక్టర్లు అనేకం చేశారు జగ్గయ్య.   నటుడిగానే కాదు, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా ఎవరికీ రాని గుర్తింపు జగ్గయ్యకు వచ్చింది. ముఖ్యంగా తమిళ హీరో శివాజీ గణేశన్‌ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసినపుడు శివాజీకి జగ్గయ్యతోనే డబ్బింగ్‌ చెప్పించేవారు. శివాజీయే మాట్లాడారా అన్నంత సహజంగా ఆయన డబ్బింగ్‌ చెప్పేవారు. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు సాహిత్య సేవ చేసేవారు. ప్రజలను చైతన్యవంతులను చేసే కవితలు రాస్తుండేవారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘గీతాంజలి’ని తెలుగులో ‘రవీంద్ర గీత’ పేరుతో అనువదించారు జగ్గయ్య. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. 1967లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం ఎం.పి.గా కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో లోక్‌సభకు ఎన్నికైన తొలి నటుడుగా కొంగర జగ్గయ్య చరిత్ర సృష్టించారు.    నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి మేరకు 1962లో ‘పదండి ముందుకు’ పేరుతో ఒక చైతన్యవంతమైన సినిమాను నిర్మించారు జగ్గయ్య. 1930లో మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఎలాంటి కమర్షియల్‌ అంశాలు లేకుండా వి.మధుసూదనరావు ఈ చిత్రాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాను పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని అందించింది.    1952 నుంచి 1994 వరకు 500కి పైగా సినిమాల్లో అన్ని తరహా పాత్రలు పోషించారు జగ్గయ్య. అయితే అన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. వాటిలో ఒకే ఒక్క తమిళ సినిమా శివగామి ఉంది. ఆయన నటించిన చివరి సినిమా 1994లో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బొబ్బిలి సింహం. దీని తర్వాత మరో సినిమా చేయలేదు జగ్గయ్య. ఆ తర్వాత ఆయనకు తొంటి ఆపరేషన్‌ జరిగింది. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 2004 మార్చి 5న చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య.

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

15 ఇయర్స్ అయ్యిందా పెళ్ళై.. డాక్టర్ బాబుని ఆడుకున్న రవితేజ!

Publish Date:Dec 31, 2025

  కొత్త ఏడాది వచ్చిందంటే చాలు సంక్రాంతి కూడా వచ్చేసినట్టే. సంక్రాంతి వస్తుందంటే చాలు బుల్లితెర మొత్తం కొత్త కొత్త షోస్, ఈవెంట్స్ తో కళకళలాడిపోతుంది. ఈ నేపథ్యంలో ఈటీవీలో "సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" టైటిల్ తో ఒక ఎపిసోడ్ రాబోతోంది. యాంకర్ సుమ ఈ షోని నిర్వహించబోతున్నారు. "ఈటీవీలో ఈ పండగ మీ ఇంటి పండగలా ఉండబోతోంది. పందెం కోళ్ల లాంటి పవర్ఫుల్ పెర్ఫార్మెన్సులతో ఈ సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం" అంటూ చెప్పారు.    ఇందులో ఆది ఫైర్ స్టార్మ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ మూవీ జానీలో సాంగ్ ప్లే అవుతుంటే ఆయన లేటెస్ట్ మూవీ ఓజిలోని వాషి యో వాషి అంటూ డైలాగ్ చెప్పేసరికి నాగబాబు కూడా పగలబడి నవ్వేశారు.    తర్వాత మాస్ మహారాజ రవితేజ వచ్చారు. "భార్యను ఇంప్రెస్ చేయడానికి భర్త ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తే బాగుంటుంది" అంటూ కార్తీక దీపం డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల రవితేజను అడిగాడు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై నీకు" అని రవితేజ అడిగారు. 15 ఇయర్స్ అని చెప్పాడు నిరుపమ్. " 15 ఇయర్స్ అయ్యిందా. ఇంకా గిఫ్ట్ ల గురించి మాట్లాడుతున్నాడేమిటి ?" అంటూ రివర్స్ లో అడిగేసరికి అక్కడే ఉన్న అనిల్ రావిపూడి "అంతేగా అంతేగా" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇక ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజు ఉదయం 10 గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది.  

విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!

Publish Date:Dec 29, 2025

  కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.   విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుందట. ఈ విషయాన్ని విజయ్, రష్మిక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్యాన్స్ కి వారిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనని అంటున్నారు.   Also Read: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!   2018లో విడుదలైన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇటీవల అక్టోబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిందని, రానున్న ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని న్యూస్ వినిపిస్తోంది.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969