English | Telugu

నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేది.. డ్రామాలు చేయకు!

బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నామినేషన్ ల ప్రక్రియ మొదలైంది. ఇక వాటికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అందులో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఎవరు ఎవరిని నామినేషన్ చేశారో ఓసారి చూసేద్దాం..

యష్మీని మణికంఠ నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు.. ఎవరు గిన్నెలు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలంటూ మణికంఠ ఏదో చెబుతుంటే.. అవును మాకు లగ్జరీ వచ్చినప్పుడు.. మా టీమ్‌కి వచ్చినప్పుడు.. మేము కడగక్కర్లే" అంటూ యష్మీ మధ్యలో మాట్లాడింది. దీంతో ఒళ్లు మండిన మణికంఠ.. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజెన్ లేడీ అంటు మణికంఠ వాయిస్ రెయిజ్ చేశాడు. దీనికి యష్మీ టాపిక్ డైవర్ట్ చేస్తూ.. నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు నా దగ్గరికొచ్చి ఫ్రెండ్‌గా అంటూ యష్మీ అంది. దీంతో నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రెయిజ్ చేస్తానంటూ మణికంఠ అన్నాడు. నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేదంటు యష్మీ బూతులు మాట్లాడింది. ఆ తర్వాత మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది యష్మీ. నేను ఈ హౌస్‌లో ఎన్ని రోజులు ఉంటానో.. ప్రతి నామినేషన్‌లో నీ పేరు అయితే నేను తీసుకుంటా.. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్.. ఇది ఫ్రెండ్ షిప్ అనే పేరుతో నన్ను మోసం చేశావంటు యష్మీ అంది. ఇది మోసం కాదంటూ మణికంఠ అనగానే.. ఇది నా నామినేషన్ గురూ నిల్చోమంటూ యష్మీ ఫైర్ అయ్యింది. చూస్తా గురు అంటూ మణికంఠ కూడా గట్టిగానే మాట్లాడాడు.

విష్ణుప్రియ తన నామినేషన్ లో భాగంగా ప్రేరణని నామినేట్ చేసింది. సాక్స్ టాస్కు లో సంఛాలక్ గా సరిగా చేయలేదనే రీజన్‌తో ప్రేరణని నామినేట్ చేయగా.. వెంటనే విష్ణుప్రియను ప్రేరణ కూడా నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ.. నువ్వు గెలవాలనే స్పిరిట్ నాకు ఇష్టం కానీ నువ్వు ఎలా గెలుస్తావన్నది నాకు నచ్చదంటు సీత రీజన్ చెప్పింది. నేను ఒక టీమ్‌లో ఆడుతున్నప్పుడు ఆపోజిట్ టీమ్‌ను ఎలాగైనా ఓడించాలనే ఆడతానంటూ పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత సోనియాను నైనిక నామినేట్ చేసింది. ఇక ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.