English | Telugu

అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్టిన యాద‌మ్మ రాజు

స్టార్ మాలో హాస్య ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో కామెడీ స్టార్స్‌. మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అందిస్తున్న `జ‌బ‌ర్ద‌స్త్‌` షోకు పోటీగా `స్టార్ మా`లో ఓంకార్ స్టార్ట్ చేసిన ఈ షో గ‌త కొన్ని నెల‌లుగా బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్‌తో కొన‌సాగుతోంది. ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1: 30 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యే ఈ షో కు సంబంధంచిన తాజా ప్రోమోని విడుద‌ల చేశారు.

ఈ ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే షోలో హ‌రి, యాద‌మ్మ రాజు, ముక్కు అవినాష్‌, యాద‌మ్మ రాజులు క‌లిసి చేసే కామెడీ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. హ‌రితో క‌లిసి యాద‌మ్మ రాజు లేడీ గెట‌ప్‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే `నా బిల్డ‌ప్ అంతా చూసి వ‌చ్చింది అషురెడ్డి అనుకున్నార్రా ` అన్నాడు హ‌రి. దానికి యాదమ్మ రాజు `నా గ్లామ‌ర్ ఎక్క‌డ అషు గ్లామ‌ర్ ఎక్క‌డ‌` అన్నాడు. నిజ‌మే నీకు, అషుకు ఆటోకీ ఆడీ కార్‌కి వున్న తేడా వుంద‌ని హ‌రి అన‌డం.. ఓ అషుని ఆటోతో పోల్చావా అని యాద‌మ్మ రాజు అన‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఇక ముక్కు అవినాష్‌తో క‌లిసి యాద‌మ్మ రాజు చేసిన స్కిట్ కూడా ఓ రేంజ్‌లో పేలనున్న‌ట్టుగా తెలుస్తోంది. ముక్కు అవినాష్ ముక్కు గుర్తుతో పోటీకి దిగ‌డం.. అత‌ని అనుచ‌రుడిగా యాద‌మ్మ రాజు గుద్దాలే గుద్దాలే ముక్కునే గుద్దాలే అంటూ ప్ర‌చారం చేస్తూ ముక్కు అవినాష్ ముక్కు ప‌గ‌ల‌గొట్ట‌డం హిలేరియ‌స్‌గా వుంది. క‌డుపుబ్బా నవ్వించే ఈ కామెడీ స్కిట్ లు వ‌చ్చే ఆదివారం బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.