English | Telugu

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది...హీరోయిన్ లైలాకి మహేశ్వరీ కౌంటర్


సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి వింటేజ్ బ్యూటీగా మహేశ్వరీ వచ్చింది. నీకోసం, పెళ్లి వంటి మూవీస్ తో హిట్ కొట్టి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసిన హీరోయిన్..ఆమె ఇన్నాళ్లకు బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో క్యూట్ అండ్ బబ్లీ హీరోయిన్ లైలా...1997 లో "ఎగిరే పావురమా" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షో హోస్ట్ రవి ఐతే మహేశ్వరితో ఒక డైలాగ్ వేసాడు. "పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయం లేని నాకు మీరు నటించిన పెళ్లి మూవీ వలన పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది" అని చెప్పాడు.

అలాగే ఇక మహేశ్వరీ ఐతే ఇంకో డైలాగ్ చెప్పింది. "వర్షం పడడానికి చేస్తారు యాగం..ఈరోజు పక్కా గెలిచేది మా పడమటి సంధ్యా రాగం" అంటూ మంచి ఫోర్స్ తో డైలాగ్ చెప్పింది. తర్వాత ఈ షో స్టేజి మీదకు లైలా వచ్చి "హలో రవి" గారు అనేసరికి ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నారో అంటూ పొంగిపోయాడు. అమ్మాయిగారు టీమ్ ని గెలిపించడానికి లైలా వచ్చింది. ఇక రవికిరణ్ ఎక్కడ ఉన్నాడో చూపించాలంటూ హోస్ట్ రవి ఒక టాస్క్ ఇచ్చాడు. ఈ స్టేజి మీద ఇక మహేశ్వరీ వెర్సెస్ లైలా అని రవి చెప్పాడు. "నా దగ్గర రేస్ గుర్రాలు ఉన్నాయి" అని చెప్పింది లైలా. "అయ్యో పాపం లైలా నా దగ్గర గెలుపు గుర్రాలున్నాయి" అంటూ మహేశ్వరీ కౌంటర్ డైలాగ్ వేసింది. ఐతే లాస్ట్ లో రెండు సీరియల్స్ కంటెస్టెంట్స్ కలిసి టాస్కులు ఆడుతుంటే మహేశ్వరీ సీరియస్ గానే వాళ్ళను ఫాలో అవుతూ ఉంది కానీ లైలా మాత్రం మొబైల్ మునిగిపోయి కనిపించింది. "లైలా గారు" అంటూ రవి గట్టిగ అరిచేసరికి లైలా ఒక్కసారిగా ఉలిక్కిపడి రవి వైపు చూసింది. "మా సీరియల్ వాళ్ళు గెలిచాక ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నా" అని చెప్పింది. వెంటనే మహేశ్వరీ "ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది" అంటూ కౌంటర్ వేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.