English | Telugu

నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-53 లో.. కావ్య గురించి స్వప్నకి చెడు అభిప్రాయం ఏర్పడేటట్లు చేస్తాడు రాహుల్. నీ అక్క వల్లనే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను బయటకు గెంటేస్తారు అంటూ రాహుల్ అంటాడు. ఇప్పుడే వద్దు పెళ్లి, నాకు గౌరవం దక్కినప్పుడే దుగ్గిరాల ఇంటి కోడలుగా వెళ్తానని రాహుల్ తో అంటుంది స్వప్న. అక్కచెల్లెళ్ళలకి గొడవ పెట్టాను.. ఇప్పట్లో స్వప్న నన్ను డిస్టర్బ్ చెయ్యదని అనుకుంటాడు రాహుల్.

మరోవైపు కనకం ఇంటికి రాగానే కృష్ణమూర్తి తిడతాడేమోనని అనుకుంటుంది. కానీ అతను కనకంని తిట్టడు. "ఒక తల్లిగా నీ కూతురుని చూడాలి అనుకునే నీ ప్రేమను నేనెలా కాదంటాను. నేను ఎందుకు తిడుతాను.. కావ్య ఎలా ఉంది" అని కృష్ణమూర్తి అడుగగా.. బాగుందని చెప్తుంది కనకం. కావ్య ఎలా ఉందో నీ కళ్ళలో సంతోషం చూస్తే కన్పిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. నీ ముఖానికి వేసుకున్న జోకర్ రంగులు ఎప్పుడు చెరిపేశావని కృష్ణమూర్తి అడుగగా.. ఎలా తెలిసిందంటూ ఎమోషనల్ అవుతుంది కనకం. నాకు మీనాక్షి అక్కడ జరిగిందంతా చెప్పిందని కృష్ణమూర్తి అంటాడు.

మరోవైపు కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి.. "నేను ఈ పనికిరాని సామాన్లు పడేసే గదికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు నా నగల కోసం వచ్చాను" అని అంటుంది. నాకు ఈ నగలు పెట్టుకోవాలనే అశేమీ లేదని కావ్య అనగానే.. మరి ఈ నగలు అన్ని ఎందుకు దిగేసుకున్నావ్ అని అపర్ణ అడుగుగా.. "ఈ నగలు సొసైటీలో నన్ను రిచ్ గా చూపించేందుకు.. మీ అబ్బాయి వేసుకోమన్నాడు.. అమ్మమ్మ గారు కూడా బలవంతం చేస్తే వేసుకున్నాను అత్తయ్య" అని నగలు ఇస్తుంది. నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదని అపర్ణ అంటుంది. నన్ను క్షమించండి.. మీరు నన్ను కోడలిగా ఒప్పుకునే వరకు మేడం అని పిలుస్తానని నగలు అపర్ణకి ఇస్తుండగా.. పనిమనిషి శాంతని పిలిచి.. ఆ నగలు తీసుకొని శుభ్రంగా కడిగి నా గదిలో పెట్టమని అపర్ణ అంటుంది. అలా అపర్ణ అనేసరికి కావ్య బాధపడుతుంది.

మరోవైపు కనకంని వెతుక్కుంటూ అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తుంది. సెక్యూరిటీ పంపించకపోవడంతో చాటుగా లోపలికి వెళ్తుంది. అప్పుని చూసిన కళ్యాణ్ తనని వెన్నక్కి లాగి.. "బ్రో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్" అని అడుగుతాడు. నేను ఎవరో తెలిసి కూడా బ్రో అంటున్నావ్ అని అప్పు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.