English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ కి ముద్దు పెట్టిన దీప.. జ్యోత్స్న మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-457 లో..... దీప దగ్గరికి పారిజాతం వచ్చి.. నువ్వంటే నాకు నచ్చదు కానీ నీ వంటలు అంటే నాకు ఇష్టమని అంటుంది. అప్పుడే అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. సుమిత్ర పక్కన దశరథ్ కూర్చోబోతు వేరొకవైపు వెళ్ళిపోతాడు. దాంతో సుమిత్ర కోపంగా చూస్తుంది. వీళ్ళు మళ్ళీ గొడవపడ్డట్టున్నారని శివన్నారాయణ అనుకుంటాడు. ఆ తర్వాత దీప అందరికి భోజనం వడ్డిస్తుంది. నాకెందుకు వెయ్యట్లేదు అని పారిజాతం అడుగుతుంది. మీకు డాక్టర్ తినమని చెప్పినవి బావ ప్రిపేర్ చేస్తున్నాడని దీప అంటుంది.

ఆ తర్వాత పారిజాతం కోసం ఉడికించిన దుంపలు తీసుకొని వస్తాడు కార్తీక్. అవి నేను తిననని పారిజాతం అనగానే కాకరకాయ జ్యూస్ తీసుకొని వస్తాడు. ఎప్పుడైనా నువ్వు అవే తినాలి.. అదేదో ఈ రోజు నుండి మొదలపెట్టమని జ్యోత్స్న అంటుంది. దాంతో పారిజాతం అయిష్టంగా వాటిని తింటుంది. సుమిత్ర, దశరథ్ లని ఉద్దేశ్శించి శివన్నారాయణ మాట్లాడతాడు.
ఏ విషయం అయిన మర్చిపోయి ముందుకి వెళ్ళాలని చెప్పి శివన్నారాయణ వెళ్ళిపోతాడు. దశరథ్, సుమిత్ర అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎవరు జరిగిందంతా సామాన్యంగా మర్చిపోరని కార్తీక్ తో జ్యోత్స్న అంటుంది. ఎందుకు అలా అంటుందని కార్తీక్ ని దీప అడుగుతుంది. అంటే నాతో అత్తామామయ్యలని కలపనని ఛాలెంజ్ చేసింది అందుకేనని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. కార్తీక్ తో ఛాలెంజ్ చేసిన విషయం జ్యోత్స్న చెప్తుంది. ఇద్దరు కలిసి మళ్ళీ దశరథ్, సుమిత్రలకి గొడవ పెట్టాలని చూస్తారు. అలా చేస్తే దీప వల్లే ఇవన్ని అని మమ్మీకి తనపై ఇంకా కోపం పెరుగుతుందని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు కార్తీక్, దీప ఇంటికి వెళ్తారు. అమ్మనాన్నని కలపడానికి ఏదైనా ప్లాన్ చేసారా అని కార్తీక్ ని దీప పదే పదే అడుగుతుంది.. చెప్తానని కార్తీక్ అనగానే తన చెయ్ పై దీప ముద్దు పెడుతుంది. నాన్న ఏంటి ఆ సౌండ్ అని శౌర్య అడుగతుంది. ఏం లేదు నువ్వు పడుకోమని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.