English | Telugu

Karthika Deepam2 : పారిజాతాన్ని ఇరికించేసిన కార్తీక్, దీప.. బెత్తంతో కొట్టిన శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -423 లో.....పారిజాతం మాటలకి దీప హర్ట్ అవుతుంది. రోజు రోజుకి ఆ పారిజాతం గారి మాటలు ఎక్కువవుతున్నాయని కార్తీక్ తో అంటుంది దీప. పారు సంగతి చెప్దాం గానీ నేను బయటకు వెళ్ళొస్తానని కార్తీక్ అక్కడ నుండి బయల్దేరతాడు. కార్తీక్ బయటకు వెళ్తుంటే పారిజాతం హాల్లో డల్ గా కూర్చొని ఉంటుంది.

ఏమైంది పారు అని కార్తీక్ అడుగుతాడు. ఏం లేదు రా మీ తాతని యాభై వేయిలు అడిగాను ఇవ్వను అన్నాడని పారిజాతం చెప్తుంది. ఇది నీ ఇల్లు పారు నీకు ఇవ్వకపోవడం ఏంటని దీపని పిలుస్తాడు కార్తీక్. ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడుగుతాడు. నాదే అనీ దీప చెప్తుంది. డబ్బు అవసరం అయితే నన్ను అడుగుతావా అని కార్తీక్ అనగానే లేదని దీప సమాధానం చెప్తుంది. చూసావా ఇంట్లో ఆడవాళ్ళదే పెత్తనం అని పారిజాతాన్ని రెచ్చగొడుతాడు కార్తీక్. అవును రా.. నా ఇంట్లో నేను అడిగి తీసుకొవడం ఏంటని బెడ్ రూమ్ లోకి వెళ్లి లాకర్ నుండి డబ్బు తీసుకొని వస్తుంటే.. హాల్లో ఫోన్ చూస్తూ శివన్నారాయణ ఉంటాడు. అతన్ని చూసి పారిజాతం భయపడుతుంది శివన్నారాయణ తను చూస్తున్న వీడియోని పారిజాతానికి చూపిస్తాడు. అందులో పారిజాతం డబ్బు తీసుకునేది ఉంటుంది. ఎవరు ఈ వీడియో తీసారని అడుగుతుంది. నేనే అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత అందరు ఇళ్లలో ఆడవాళ్ల పెత్తనం ఉంటుంది కావాలంటే దీపని అడగండి అని పారిజాతం అంటుంది. ఇంట్లో ఎవరి పెత్తనం దీప అని కార్తీక్ అడుగుతాడు. మీదే అనీ దీప అంటుంది. నన్ను అడగకుండా డబ్బులు తీసుకుంటావా అని కార్తీక్ అనగానే నిన్ను అడగకుండా ఒక్కరూపాయి కూడా తీయనని దీప అనగానే పారిజాతం షాక్ అవుతుంది. ఇలా మాట మార్చావ్ ఏంటే అని పారిజాతం టెన్షన్ పడుతుంది.

పారిజాతం చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలని కార్తీక్ అంటాడు. నా దగ్గర బెత్తమ్ ఉందని ఇస్తాడు. దాంతో శివన్నారాయణ బెత్తం తీసుకొని పారిజాతం చెయ్ పై కొడతాడు. ఆ తర్వాత నువ్వు నిన్న ఇదే చేత్తో నా భార్యని కొట్టడానికి లేపావని పారిజాతంతో కార్తీక్ అంటాడు. ఇలా రివెంజ్ తీసుకున్నావ్ కదరా అని పారిజాతం దెబ్బని చూస్తూ అనుకుంటుంది. మరొకవైపు కుబేర్ ఆర్ధికంకి కార్తీక్, దీప అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు.. మీ నాన్న అన్న మాటలకా ఎలాగు వెళ్తాము కదా అని కార్తీక్ అనగానే.. ఏంట్రా దీప అమ్మనాన్న అంటున్నావ్.. లేరు కదా అని కాంచన అనగానే కార్తీక్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.