English | Telugu

Brahmamudi : బాబుకి దగ్గరైన అపర్ణ.. తనకి రేవతి కొడుకు అని తెలిసిపోతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -787 లో..... రేవతి కొడుకుని అపర్ణ ఇంటికి తీసుకొని వస్తుంది. ఎవరు ఈ బాబు అని అందరు అడుగుతారు. మొన్న ఒక బాబు పరిచయం అయ్యాడని చెప్పాను కదా అదే బాబు..... గుడిలో తప్పిపోయాడు అందుకే తీసుకొని వచ్చానని అపర్ణ చెప్తుంది. ఈ బాబుని ఎక్కడో చూసానని స్వప్న, అప్పు అంటారు. చెప్పకండి అని కావ్య సైగ చెయ్యడంతో ఇద్దరు ఆగిపోతారు.

ఆ తర్వాత బాబుని ఇందిరాదేవి చూసి సీతారామయ్య దగ్గరికి వెళ్లి రేవతి కొడుకు వచ్చాడు వెళ్లి చుడండి అని చెప్తుంది. సీతారామయ్య వచ్చి చూస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఆ బాబుకి తెలుసు కదా ఎదరుపడకు అని ఇందిరాదేవితో చెప్తాడు సీతారామయ్య. కాసేపటికి సీతారామయ్య కిందికి వెళ్లి ఎవరు ఈ బాబు అని ఏం తెలియనట్లు అడుగుతాడు. దాంతో అపర్ణ జరిగింది చెప్తుంది. అప్పు నువ్వు రేపటి వరకు బాబు పేరెంట్స్ ఎవరో కనుక్కోమని రాజ్ అంటాడు. బాబుకి ఆకలిగా ఉన్నట్టుంది నేను పెడతానని అపర్ణ లోపలికి తీసుకొని వెళ్తుంది.

ఆ తర్వాత నాకు నా చిట్టి అంత చెప్పింది. అపర్ణకి కోపం వస్తే మాత్రం ఎవరు తట్టుకోరని రాజ్, కావ్యలతో సీతారామయ్య అంటాడు. కాసేపటికి స్వరాజ్ కి భోజనం పెడుతుంది అపర్ణ. అత్తయ్యగారు బాబుపై ప్రేమ అనురాగం చూపించడం లేదని రాజ్ తో కావ్య అంటుంది. రాజ్ వెళ్లి మీకు బాబుపై ప్రేమ లేదని అంటాడు. ఎక్కడ నిజం బయటపడుతుందోనని కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత స్వరాజ్ కి భోజనం పెడుతుంటే సుభాష్ పై బాబు కూర్చొని ఉంటాడు. అదంతా వీడియో కాల్ లో రేవతికి చూపిస్తుంది కావ్య. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య అందంగా ముస్తాబవుతుంది. ఏంటి స్పెషల్ అనీ ఇందిరాదేవి అడుగగా మీ మనవడు ఈ రోజు నాకు ప్రపోజ్ చేస్తున్నాడని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత బాబు పేరెంట్స్ తెలిసారని అప్పు అనగానే ఒకసారి బాబు వాళ్ళ అమ్మతో మాట్లాడుతానని అపర్ణ అంటుంది. దాంతో అపర్ణకి ఫోన్ ఇస్తుంది అప్పు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.