English | Telugu

Karthika Deepam2 : దీప చేసే ఉప్మా బిర్యానీకి క్రేజ్ పెంచడానికి కార్తీక్ ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -205 లొ....శివన్నారాయణకి తన ఫ్రెండ్ కాల్ చేసి పేపర్ లో వచ్చింది చూసాను. మీది ఇంత పరువు తక్కువ కుటుంబమని అనుకోలేదు. అలాంటి ఇంటి నుండి నేను సంబంధం కలుపుకోను. మీ మనవరాలికి వేరే సంబంధం చూసుకోండి అని అతను అంటాడు. పేపర్ లో ఏం వచ్చిందని శివన్నారాయణ చూస్తాడు. అందులో దీప కార్తీక్ ల ఫోటో వస్తుంది. అది చూసి వీడు ఇంటి పరువు తీస్తున్నాడని అంటాడు. అప్పుడే పారిజాతం అది చూసి వీడు నాతో అన్నంత పని చేసాడని అనుకుంటుంది . మీ పరువు తీసిన వాడిని వదిలిపెట్టవద్దని పారిజాతం అనగానే.. ఆ విషయం నువ్వు నాకు చెప్పనవసరం లేదు. వాడి సంగతి చెప్తానని శివన్నారాయణ బయలుదేర్తాడు.

ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం పేపర్ చూస్తే కోపంగా.. ఆ దీప నేను అన్న మాటలన్ని చెప్పి రెచ్చగొట్టినట్లు ఉంది. అందుకే ఇలా చేసాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఇప్పుడు నేను బావతో మాట్లాడాలని జ్యోత్స్న ఆవేశంగా బయలుదేర్తుంది. మరొకవైపు న్యూస్ పేపర్ లో వచ్చింది దీపకి చూపించాలనుకొని ఇబ్బంది పడుతుంటాడు. అమ్మకి అయిన చూపిద్దామని అనుకుంటాడు. అప్పుడే స్వప్న, కాశీ లు వస్తారు. పేపర్ లో వచ్చిన న్యూస్ ని చూపిస్తారు. అప్పుడే కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్తుంటే.. శౌర్యని తీసుకొని వెళ్ళురా ఈ రోజు సెలవు కదా అని కాంచన అంటుంది. వదినని కూడ తీసుకొని వెళ్ళమని స్వప్న అంటుంది. ఇక అందరు కలిసి శౌర్య, కార్తీక్ లతో పాటు దీపని కూడా పంపిస్తారు.

ఆ తర్వాత దీపని తీసుకొని కార్తీక్ రెస్టారెంట్ కి వెళ్ళాక.. అక్కడ మెను మొత్తం చేంజ్ చేస్తాడు. మొత్తం దేశీయ వంటకాలతో పాటు దీప చేసే ఉప్మా బిర్యానీని కూడా మెనూ లో ఆడ్ చేస్తాడు. ఉప్మా బిర్యానీ రెసిపీ చెప్పమని దీప నీ అడుగగా.. అది ఎందుకని దీప అంటుంది. ఇప్పుడు దాని స్థాయి పెంచుతున్నావ్ చెప్పమని కార్తీక్ అంటాడు. ఒక వైపు కార్తీక్ తో మాట్లాడాలని జ్యోత్స్న వస్తుంటుంది. కార్తీక్ తో గొడవ పడాలని శివన్నారాయణ‌ వస్తుంటాడు. అక్కడ పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.