English | Telugu

ప్రేరణకి రోజా పూవు ఇచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓంకార్!


నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లో ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లు ముగిసాయి. హౌస్ మేట్స్ అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో ఓ మాస్ సాంగ్ కు ఓంకార్ ఎంట్రీ ఇచ్చాడు.


హౌస్‌లోకి ఓంకార్ ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఫుల్ జోష్ వచ్చింది. ఇక అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఓంకార్ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. నా దగ్గర 7 రోజా పువ్వులు ఉన్నాయ్.. నేను అందరినీ ఒక్కో ప్రశ్న అడుగుతా.. నన్ను ఇంప్రెస్ చేసే ఆన్సర్ ఇచ్చినవాళ్లకి ఒక రోజ్ ఇస్తా అంటూ ఓంకార్ చెప్పాడు. ఇక ముందుగా గౌతమ్‌ని లేపి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయికి సాంగ్ ద్వారా ఐ లవ్యూ ప్రపోజ్ చేయాలి అంటూ ఓంకార్ చెప్పాడు. దీంతో ఇళయరాజా కంపోజ్ చేసిన "ప్రియతమా నీవచట కుశలమా" సాంగ్ పాడాడు గౌతమ్. బాగానే పాడటంతో రోజా పువ్వు ఇచ్చేశాడు ఓంకార్.

తర్వాత ఐ లవ్యూని యానిమల్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటూ రోహిణికి వింత టాస్కు ఇచ్చాడు. పాపం రోహిణి ఏదో కష్టపడి కోతిలా యాక్ట్ చేసింది.. ఆ కష్టానికి ఓ పువ్వు ఇచ్చేశాడు ఓంకార్. ఇక నబీల్‌కి నీ పార్టనర్‌తో కలిసి ఒక దొంగతనం చేయాలంటే ఏం దొంగతనం చేస్తారంటూ ఓంకార్ అడిగాడు. దీనికి నేను నా పార్టనర్‌తో ఇస్మార్ట్ జోడీ షోకి వెళ్లి ప్రేక్షకుల మనసులు దోచేస్తా అంటూ నబీల్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ సమాధానానికి ఓంకార్ అన్నయ్య ఫిదా అయిపోయాడు. నెక్స్ట్ విష్ణుప్రియకి కూడా ఓ వింత ప్రశ్న ఇచ్చాడు ఓంకార్. నీ పార్టనర్ ఓ వెజిటెబుల్‌గా మారాలంటే ఎలా మారాలనుకుంటున్నావని అడిగితే.. బెండకాయ అని విష్ణుప్రియ అంది. ఎందుకంటే తనే నా గుండెకాయ అంటూ నవ్వించింది విష్ణు. దాంతో తనకి ఓ గులాబీ ఇచ్చాడు ఓంకార్.చివరిగా ప్రేరణని ఓ కొశ్చన్ అడిగాడు ఓంకార్. నీకు టైమ్ ట్రావెల్ చేసే ఛాన్స్ ఇస్తే ఫ్యూచర్‌కి వెళ్లి మీ పార్టనర్ భవిష్యత్తుని తెలుసుకుంటారా.. పాస్ట్‌టెన్స్‌లోకి వెళ్లి మీ మిస్టేక్స్ ఏమైనా కరెక్ట్ చేసుకుంటారా అంటూ ఓంకార్ అడిగాడు. దీనికి భవిష్యత్తులోకి ఎంత వెళ్లినా.. మా ఆయనతో నేనే ఉంటానంటూ ప్రేరణ అనగానే ఓంకార్ క్లాప్స్ కొట్టాడు. రోజా పువ్వు ఇచ్చి మీ భర్త శ్రీపద్‌తో మీరు త్వరలోనే ఇస్మార్ట్ జోడి-3కి రావాలంటూ ఓంకార్ చెప్పాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.