English | Telugu

సౌజన్య కూతురి కాళ్లకు పట్టీలు తొడిగిన బాలయ్య

ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో పోటీ పడుతున్న సింగర్స్ ని ఒక్కొక్కరిగా ఇంట్రడ్యూస్ చేసే ఒక కొత్త సంస్కృతికి రూపం ఇచ్చింది ఆహా టీమ్. దానికి గాల విత్ బాల పేరు పెట్టి బాలయ్య బాబుతోనే పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు కంటెస్టెంట్ సౌజన్య వంతు వచ్చింది. "వచ్చింది వైజాగ్ వీరనారి...సింగింగ్ తోనే చేస్తుంది స్వారీ...సౌజన్య..ఓ సౌజన్య...నువ్వు ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈ దునియా" అంటూ టాప్ 12 సెలెక్ట్ ఐన కంటెస్టెంట్ సౌజన్యాని తన సాంగ్ తో ఇంట్రడ్యూస్ చేశారు బాలయ్య. "గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ నుంచి ఎకిమీడా..నా జత విడనని వరమిడవ" అనే సాంగ్ ని పాడింది.

ఇక ఈ సాంగ్ కి అందరూ ఫిదా ఇపోయారు " యు అరెస్టెడ్ అవర్ ఇయర్స్..నిజంగా శ్రేయా గోషాల్ వాయిస్ వింటున్నట్టే ఉంది " అని థమన్ అన్నారు. "ఎన్ బికె గారి టాప్ 12 అంటే టాప్ క్లాస్" అంది మరో జడ్జి గీతామాధురి. ఇక సౌజన్య పెర్ఫార్మెన్స్ కి ఆమె గాత్రానికి ముగ్దులైపోయి అందరూ కలిసి ఒకేసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసారు. అలా సౌజన్య ఫామిలీ మొత్తం స్టేజి మీదకు వచ్చింది. తరువాత బాలయ్య కూడా స్టేజి మీద వాళ్ళతో కలిసి సందడి చేసారు అలాగే సౌజన్య చిన్నారి కూతురుకి చిన్న కానుక అని చెప్పి ఆమె కాళ్లకు పట్టీలు తొడిగారు. కాసేపు ఎత్తుకుని ముద్దాడారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా' తన జోరును కొనసాగిస్తోంది. కొత్త మూవీస్, కొత్త షోస్, కొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు చాల దగ్గరయింది.

ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 , అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలతో తన జర్నీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఈ షోస్ అన్నిటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ షోలకు కొనసాగింపుగా సీజన్ 2 లు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగానే స్టార్ట్ ఐన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 దుమ్ము రేపడానికి సిద్దమయ్యింది. వీకెండ్స్ లో ఆడియన్స్ ని అలరించడానికి వచ్చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.